India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మండలాలు ఇకపై మండల ప్రజా పరిషత్లుగా ఏర్పాటు కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, కౌకుంట్ల, గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి, వనపర్తి జిల్లాలో యేదుల, నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వీటికి ప్రత్యేకంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ సంక్షేమ అధికారి మాధవి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీ నేతలు, యూనియన్లు, ప్రజా సంఘాల నేతలు పోలీసుల అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నేటి నుండి ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. ధర్నాలు, నిరసన ర్యాలీలు, మత పరమైన ర్యాలీలు పోలీసుల అనుమతులు లేకుండా నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.
ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. షాద్ నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రభుత్వాలు విద్యకు నిధుల కేటాయింపులు తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య విధ్వంసానికి కారణాలను వెతికి పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.
శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర , జోగులాంబ అమ్మవారు కొలువైన్నారు, మహాశక్తి పీఠాలలో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను ఆకట్టుకుంటుంది.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు మున్సిపాలిటీ స్టేషన్ తిమ్మాపూర్ వద్ద <<14756133>>ట్రాక్టర్ బోల్తా<<>> పడి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా మృతుల్లో మహిళతోపాటు ఐదేళ్ల చిన్నారి ఉండటం కలిచివేసింది. APలోని కర్నూల్‌కు చెందిన కూలీలు మండలంలోని రెడ్డిపాలెంలో పనులకు వస్తున్నారు. తిమ్మాపూర్‌లో రైలు దిగిన వారు ట్రాక్టరుపై రెడ్డిపాలెం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సోమమ్మ(50), మమత(5) అక్కడిక్కకడే మృతిచెందారు.
✓రైతు కుటుంబాలకు 2747.67 కోట్ల రూపాయల రుణమాఫీ. ✓మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం రూ.255 కోట్లు విడుదల.✓ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటం. ✓కొడంగల్ లో 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధ. ✓కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడకుండా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిపంట
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా సభ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.