Mahbubnagar

News July 2, 2024

రేపు PUలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పాలమూరు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని సూచించారు.

News July 2, 2024

ఉమ్మడి జిల్లాలో జోరుగా ఫిల్టర్ ఇసుక దందా

image

ఉమ్మడి జిల్లాలో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతను బట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకు రూ.1.75 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. చెరువులు, కుంటల వద్ద మట్టిని, గుట్టలను తొలిచి వచ్చిన మట్టిని ఇసుకగా మారుస్తున్నారు. మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News July 2, 2024

శిధిల భవనాల్లో బతుకులు భద్రమేనా..!

image

వర్షాకాలం వస్తుందంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన గణాంకాల ప్రకారం 46,701 పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయి. నూతన ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News July 2, 2024

MBNR: గుండెపోటుతో ANM మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లాలో డాక్టర్స్ డే రోజే విషాదం నెలకొంది. నవాబ్ పేట PHCలో గుండెపోటుతో ఏఎన్ఎం మృతిచెందింది. ఏఎన్ఎం కృష్ణవేణి(34) సోమవారం ఉదయం ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న డా.నరేశ్ చంద్ర సీపీఆర్ చేసి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణవేణికి భర్త, కుమారుడు ఉన్నారని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిబ్బంది కోరారు.

News July 2, 2024

MBNR: విధుల్లో చేరిన SGTలు.. మొత్తం 7,363 మందికి స్థాన చలనం

image

ఉమ్మడి జిల్లాలో SGTల బదిలీల ప్రక్రియ ముగిసింది. కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కూడా స్థాన చలనం కలిగింది. SGT సమాన స్థాయి ఉపాధ్యాయులకు అధికారులు సోమవారం బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో ఉంచారు. MBNR-1,043, NGKL-847,
GDWL-506, NRPT-466, WNPT-572 మంది బదిలీ అయ్యారు. SGTలతో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,363 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది.

News July 2, 2024

MBNR: రైలు కిందపడి తండ్రి, కుమార్తె సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే SI సయ్యద్ అక్బర్ వివరాలు.. స్థానిక శ్రీరాం కాలనీలో ఉంటున్న శివానంద్(50), ఆయన కుమార్తె చందన(20) ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా, ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్నారు. సోమవారం రాత్రి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నారు. వీరి స్వస్థలం వికారాబాద్(D) మందిపల్‌. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.

News July 2, 2024

MBNR: నేటి నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు

image

డా.బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ(సైన్స్, కంప్యూటర్ విభాగాలు) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 2 నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డా. జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. తరగతులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు మ్యానువల్ పుస్తకాలు, ఫీజుల రసీదులు వెంట తీసుకురావాలని అన్నారు.

News July 2, 2024

ఉమ్మడి పాలమూరుకు 131 మీసేవ కేంద్రాలు

image

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి పల్లెలో మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు 131 మీసేవ కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్క MBNR జిల్లాకే అత్యధికంగా 70, వనపర్తి జిల్లాకు అత్యల్పంగా 4 కేంద్రాలు మంజూరయ్యాయి. ‘మహిళా శక్తి’ పేరుతో మంజూరు చేస్తున్న మీసేవల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. ఇంటర్, ఆపై చదివిన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.

News July 2, 2024

MBNR: కోయిల్ సాగర్‌ను పరిశీలించిన కలెక్టర్..!

image

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగు నీరు అందుతుందనే వివరాలు ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News July 1, 2024

కొడంగల్: పురుగు మందు తాగి బాలుడు ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంటకు వెంకటేష్ (16) చదువు మధ్యలోనే వదిలేశాడు. కాగా అతను కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్దామని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లిన బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కొడంగల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి చెప్పారు.