India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.
2014లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది కాదా అంటూ మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఏడు లక్షల కోట్ల అప్పులకు ప్రతినెల 6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని గుర్తు చేశారు.
తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతుంటే.. KCR ఫామ్ హౌస్‌లో పన్నీరు తిన్నాడని మండిపడ్డారు. పదేళ్లలో KCR 50 వేల GOVT ఉద్యోగాలిస్తే తాము కేవలం 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని చెప్పారు.
పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి సీఎం కావడం మన అదృష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ పనులు మొత్తం పూర్తి చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిక్షణం రైతుల కోసమే పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ వద్ద జరిగిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏనాడు రైతుల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు నేడు వారిని రెచ్చగొడుతూ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ గ్రామ సమీపంలో రైతు పండుగ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
రైతుపండగ ముగింపు సభ కోసం నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సీఎం తన X ఖాతలో ‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి ‘మార్పు’ కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది’ అని పోస్టు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, రుణమాఫీ కానీ రైతులకు మాఫీ, పలు అంశాలపై ఉమ్మడి జిల్లా ప్రజలకు హామీలు కురిపించనున్నారు.
అమిస్తాపూర్‌లో కాంగ్రెస్ ప్రజాపాలన ‘రైతు పండగ’కు సర్వం సిద్ధంమైంది. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు లక్షమంది రైతులు పాల్గొనేలా నాయకులు ప్లాన్ చేశారు. ఆసక్తిగల రైతులను ఏఈవోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సుల్లో ప్రదర్శన తీసుకెళ్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతులు, నాయకులు ప్రత్యేక వాహనాల్లో అమిస్తాపూర్‌కు బయలుదేరారు. సీఎం రేవంత్ సాయంత్రం 4.30కి సభలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.