Mahbubnagar

News June 30, 2024

T-20 ఛాంపియన్ ఇండియా.. MDCA హర్షం

image

ఇండియా టీం పొట్టి క్రికెట్ ఛాంపియన్(T-20)గా నిలవడం చాలా సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (MDCA) ప్రధాన కార్యదర్శి M. రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా Way2Newsతో ఆయన మాట్లాడుతూ..17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని, యువతలో క్రికెట్ క్రేజ్ మరింత పెరిగిందని, ఉమ్మడి జిల్లా యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.

News June 30, 2024

MBNR: ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

image

MBNR: రెగ్యులర్, ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ల గడువు ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూలై 31వ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ నెల 30న మొదటి దశ అడ్మిషన్ల ముగింపు ఉండగా, బోర్డు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి రెండోదశ అడ్మిషన్లు ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

News June 30, 2024

PUకు రూ.100 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్

image

PU ఏర్పడి 16ఏళ్లు గడుస్తున్నా కనీసం వసతులు కరవయ్యాయి. ఎక్కడ చూసినా సమస్యలు కనిపించేవి. పీయూ లైబ్రరీలో సైతం అరకొర పుస్తకాలే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష స్కీమ్ ద్వారా ఈ ఏడాది రూ. 100 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ వివిధ విభాగాల్లో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

News June 30, 2024

MBNR: విధుల్లోకి 285 మంది అతిథి అధ్యాపకులు

image

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది విధులు నిర్వహించిన 285 మంది అతిథి అధ్యాపకులు విధుల్లో చేరారు. దీంతో 28న గతేడాది పని చేసిన అతిథి అధ్యాపకులను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి జిల్లా లోని 59 జూనియర్ కళాశాలల్లో 285 మందిని జులై 31 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News June 30, 2024

మన పాలమూరు వాసి SBI ఛైర్మన్ !

image

SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని FSIB సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం SBI ఎండీగా ఉన్న ఆయన గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. ఆయన ఇంటర్ వరకు ఆలంపూర్, గద్వాలలో చదివారు. రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన శెట్టి.. ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా 1988లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరడంతో గ్రేడ్. అయితే ఛైర్మన్ ఎన్నికపై కేంద్రానిదే తుది నిర్ణయం.

News June 30, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ అభిమానుల సంబరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. T-20 వరల్డ్ కప్ ఫైనల్లో  దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ.. దేశాభిమానాన్ని చాటుకున్నారు. టపాసుల శబ్దాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా మారుమోగింది. 

News June 30, 2024

పాలమూరులో 74,905 ఎకరాల్లో పంటల సాగు

image

ఈ వానాకాలంలో జున్ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై 24 రోజులు అయినా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో 3,23,533 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అక్కడక్కడా కురిసిన వర్గాలకు 40 శాతం మేర అంటే 74,905 ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.

News June 29, 2024

పాలమూరులో గర్జించిన నిరుద్యోగులు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు శనివారం మోతీలాల్ నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని, గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున తీసుకోవాలని ఫైరయ్యారు.

News June 29, 2024

అమ్రాబాద్: టైగర్ సఫారీ టూర్ వాయిదా

image

అమ్రాబాద్ నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులు జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు టైగర్ సఫారీ టూర్‌ను వాయిదా వేసుకోవాలని, వణ్యప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా ఈ సమయంలో సఫారీ టూర్‌ను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ 3నెలలు శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వాహనాల వేగం 30కి మించరాదని, వన్యప్రాణుల స్వేచ్ఛకు ఎవరూ భంగం కల్గించరాదన్నారు. వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ, అటవీ సంపద, పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు.

News June 29, 2024

WNP: అక్రిడిటేషన్ జర్నలిస్ట్ పిల్లల్లో ఒకరికి ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య

image

వనపర్తి జిల్లాలో ప్రతి అక్రిడిటేషన్ జర్నలిస్ట్ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఉచిత విద్య, మరొకరికి 50% ఫీజు రాయితీతో విద్యను బోధించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. అమలుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మండల విద్యాధికారులను ఆదేశించారు. TUWJH -143 యూనియన్ జిల్లా కమిటీ రిప్రజెంటేషన్ మేరకు ఈ సర్క్యులర్ విడుదల చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.