India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో జూరాల వద్ద పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83వేల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లిలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మొహ్మదాబాద్ 22.8 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా మదనాపురంలో 21.5 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆపిల్ ఫోన్ దక్కించుకునేందుకు ఓవ్యక్తి ఏకంగా హత్య చేయబోయిన ఘటన MBNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. వీరన్నపేటకు చెందిన సయ్యద్‌మస్తాన్, టీడీగుట్ట ఫైర్‌స్టేషన్‌కు చెందిన అక్తర్ ఫ్రెండ్స్. ఈనెల 12న అక్తర్ ఫోన్‌ను ముస్తాన్ తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఫోన్ తీసుకునేందుకు ముస్తాన్ ఇంటికెళ్లగా కత్తితో పొడిచాడు. అక్తర్‌ను ముళ్లపొదల్లో వేయడానికి బైక్‌పై తీసుకెళ్లి భయంతో క్లాక్ టవర్ వద్ద వదిలి పరారయ్యాడు.
బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష 18, జనవరి, 2025న నిర్వహిస్తామని తెలిపారు.
మహబూబ్‌నగర్ పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న ఆన్ లైన్ డీఎస్సీ పరీక్షలకు శనివారం 475 మందికి గాను 405 మంది హాజరైనట్లు డీఈఓ రవీందర్ తెలిపారు. ఉదయం మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
రైతుబీమా కోసం 2024 జున్ 28 నాటికి రిజిస్ట్రేషన్ అయిన వారి జాబితా ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయశాఖకు అందిందిన DAO వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18-59 సం.లు ఉన్న వారు ఆగస్టు 4లోపు క్లస్టర్ వ్యకసాయ విస్తరణ అధికారిని కలిసి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతుబీమా దరఖాస్తు ఫారానికి పట్టా పాస్‌బుక్, ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ కాపీలతో రైతులు AEDOను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఒంటరి వృద్ధులు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వరుస దొంగతనాలు చేసే ముఠాను పట్టుకున్నట్లు రూరల్ CI గాంధీనాయక్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. MBNR పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ హుస్సేన్, ఉమ ఒంటరిగా వృద్ధులు, వృద్ధ మహిళలు కనబడగానే ఆటో ఎక్కించుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపుతామని బెదిరించి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బు లాక్కుంటారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేతాన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలిపారు. జిల్లాలో వర్షాల దాటికి వాగులు ప్రవహిస్తున్న దృష్ట్యా ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏమైనా అపాయం పొంచి ఉన్నా, ప్రమాదాలు జరిగిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.