Mahbubnagar

News June 27, 2024

మాజీ సీఎంను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

image

వనపర్తి జిల్లా BRS ముఖ్య నేతలు మాజీ CM కేసీఆర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ అంశాలపై జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించినట్లు, పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో BRS సత్తాచాటాలని కేసీఆర్ సూచించినట్లు జిల్లా అధ్యక్షులు గట్టుయాదవ్ తెలిపారు. పార్టీనేతలు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News June 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✏ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు
✏MBNR: చెంచు ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి సీతక్క
✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణపై ర్యాలీలు
✏జడ్చర్లలో ఫ్లై ఓవర్‌పై మృతదేహం
✏సివిల్ సర్వీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం:BC స్టడీ సర్కిల్
✏GDWL: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
✏ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏబీవీపీ
✏నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ చేయాలి:NSUI,SFI

News June 26, 2024

మోతిలాల్ నాయక్‌కు బర్రెలక్క మద్దతు

image

నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మోతిలాల్ నాయక్‌కు బర్రెలక్క(శిరీష) బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఆస్పత్రికి వెళ్లి మద్దతు తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని బర్రెలక్క కోరారు. ఆమె వెంట నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు.

News June 26, 2024

జడ్చర్లలో ఫ్లై ఓవర్‌పై మృతదేహం

image

జడ్చర్లలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో నేషనల్ హైవే- 44 ఫ్లై ఓవర్ పై గుర్తుతెలియని వ్యక్తి శవం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, తెల్ల షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

News June 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోటకొండలో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా జానంపేటలో 8.8 మి.మీ, గద్వాల జిల్లా అలంపూర్లో 5.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సెరివెంకటాపూర్ 3.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లి 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 26, 2024

సర్కార్ బడులకు  ఉచిత విద్యుత్ !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,187 విద్యాలయాలకు ఉచిత విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించినప్పటికీ జీరో బిల్లులు అందజేయనున్నారు. ఉచిత విద్యుత్తు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అమలు కోసం పోర్టల్ అనుసంధానం చేయనున్నారు.

News June 26, 2024

NGKL: ఇంటర్‌ ఫెయిల్‌.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ కాలేదని మనస్తాపంతో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగాయి. పోలీసుల వివరాలు.. అచ్చంపేట మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన పవన్‌(17) ఇంటర్ ఫస్టియిర్‌లో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌‌కు చెందిన రాకేశ్ తరగతి గదిలో కూల్ డ్రింక్స్‌లో పురుగు మందు కలిపి తాగగా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News June 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల వివరాలు..

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్-397, నాగర్ కర్నూల్-451, గద్వాల-305, వనపర్తి-310, నారాయణపేట-271 మంది స్కూల్ అసిస్టెంట్(SA) సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఈ నెల 23న పాత స్థానాల నుంచి విడుదలైనట్లు ఉత్తర్వులు జారీ అవ్వగా.. కొత్త స్థానాల్లో 24 నుంచి విధుల్లో చేరారు. మంగళవారం బదిలీ అయిన వారికి వీడ్కోలు, కొత్త వారికి స్వాగతం పలికారు. ఉపాధ్యాయుడు బదిలీ అవ్వడంతో పలు విద్యార్థులు కన్నీటి పర్వం అయ్యారు.

News June 26, 2024

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు

image

స్థానిక సంస్థల ఎన్నికలలోపే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు అనుగుణంగా పార్టీ విధేయులు.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులెవరు అంటూ ఆరా మొదలు పెట్టినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు ఆశలు చిగురిస్తున్నాయి. నేతలను ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు గాంధీ భవనం చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

News June 26, 2024

పాఠశాలలో చేరిన SAలు.. SGTల పదోన్నతులపై ఫోకస్

image

స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు SAలుగా పదోన్నతి కల్పించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1,734 మంది SAలు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు మంగళవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందనున్న SGTలు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.