India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని కనిపించింది. గ్రామస్థుల వివరాలు.. పానగల్ (M) చిక్కేపల్లికి చెందిన బాలకృష్ణతో వివాహమైంది. నాగర్‌కర్నూల్ జిల్లాకి చెందిన ప్రశాంతి(21) భర్త వేధింపులకు పుట్టింటిలోనే ఉంటోంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త కొట్టి ఉరేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. పెద్దకొత్తపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీసీ కమిషన్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బీసీ కమిషనర్ ఛైర్మెన్ నిరంజన్ నేతృత్వంలో జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మీలు వస్తున్నారని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు బీసీ వర్గాల విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్లు దామాషాపై తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.
ప్రభుత్వం అసమర్థత వల్లే మాగనూరు ఘటన జరిగిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఢిల్లీలో ఉన్న డీకే అరుణ ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు కూడా సరైన భోజనం పెట్టకపోవడం దారుణం అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామికి అలంకరించిన ఆభరణాలను గురువారం ఆత్మకూరుకు తరలించారు. కురుమూర్తి జాతర సందర్భంగా 17 రోజుల క్రితం ఆత్మకూరు SBI బ్యాంకు నుంచి స్వామి వారి ఆభరాణాలు కురుమూర్తికి తరలించారు. జాతర ముగియడంతో తిరిగి నేడు ఆత్మకూరు SBI బ్యాంక్‌కు చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మదనేశ్వర్, ఆలయ కార్యదర్శి గోవర్ధన్, చిన్న చింతకుంట ఎస్సై శేఖర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
మాగునూర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేశారు. బుధవారం (నిన్న) మధ్యాహ్న భోజనం వికటించి మాగనూర్ జడ్పీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఫుడ్ పాయిజన్‌కు గురై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదని ధైర్యం చెప్పారు. విద్యార్థులకు సరైన ఆహారం, వైద్యం అందించాల్సిందిగా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
కృష్ణ మండలం పరిధిలోని తంగిడి కుంటలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి వీరేష్ వెళ్తుండగా మొసలి కనిపించిందని తెలిపారు. మొసలి ఉన్నట్లు గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అటువైపు వెళ్ళవద్దని మత్స్యకారులు, పశువుల కాపరులు కుంటలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ ప్రభుత్వానికి రైతుల పైన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బుధవారం మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి కురుమూర్తి జాతరకు వెళుతున్నా ఆయన మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇస్తామన్న 500 బోనస్ బోగస్ పథకంగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25 తేదీన జరగాల్సిన డిగ్రీ మొదటి, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.వాయిదా పడ్డ పరీక్ష టైం టేబుల్ త్వరలో తెలియజేస్తామని తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.