India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడుపు నొప్పితో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన 4 నెలల గర్భిణి మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో జరిగింది. కుటుంబ సభ్యులు, SI వెంకటేశ్వర్లు వివరాలు.. శ్రీరంగాపూర్(మం) నాగసానిపల్లికి చెందిన పుష్పలత(22) శనివారం కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కర్నూలు సిఫార్సు చేయగా అప్పటికే మృతి చెందినట్లు కర్నూలు వైద్యులు తెలిపారు.
ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కోసం అన్ని పాఠశాలల HMలు తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను పంపాలని డీఈవో డా. గోవిందరాజులు తెలిపారు.9,10 తరగతుల విద్యార్థులు రూ.120 వంతున, ప్రయివేట్ యాజమాన్య పరిధిలోని పాఠశాలల్లో 6-8 విద్యార్థులు రూ.120,9,10 తరగతుల విద్యార్థులు రూ.150 వంతున చెల్లించాల్సి ఉంటుందని,ఫీజు వసూలు చేసి డీసీఈబీ కార్యదర్శి పేరుతో DDలు తీసి ఆగస్టు 31లోగా పంపాలన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరీక్షల బోర్డు (DCCB) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కోసం అన్ని పాఠశాలల HMలు తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను పంపాలని డీఈవో డా. గోవిందరాజులు తెలిపారు. ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారా అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6-8 తరగతుల విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.
పాలమూరుకు చెందిన యువకుడు అమెరికాలో ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, MBNR జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో స్నేహితుడితో కలిసి ఈతకు వెళ్లాడు. ఓరాయి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకునే క్రమంలో మధ్యలోనే ఆగి తిరిగి వస్తుండగా మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని ఇటీవల KCR, KTR, హరీశ్‌రావు అనడం హాస్యాస్పదమని సీఎం రేవంత్ అన్నారు. ఇబ్బందుల్లో పడ్డది తెలంగాణ ప్రజలు కాదని.. KCR కుటుంబం ఇబ్బందుల్లో పడిందన్నారు. KTR సెల్ఫీలు దిగుతూ.. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు.
‘జైపాల్ రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు.. జైపాల్ రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చింది’ అని సీఎం రేవంత్ అన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. అప్పుడు కాంగ్రెస్‌కు సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ గెలిచే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ దారుణంగా ఓడిపోవడంతో నిరాశతో ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేస్తామన్నారు.
జైపాల్ రెడ్డి రాజకీయ నేత కాదు.. సిద్ధాంతకర్త అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారం ఉన్నా లేకున్నా జైపాల్ రెడ్డి సిద్ధాంతం వీడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పాటుపడ్డారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎదిగారు. దేశ రాజకీయాలను శాసించే సత్తా కల్వకుర్తికి ఉంది. నేను ఎంత ఎదిగినా నల్లమల్ల బిడ్డనే.. నాకు ఏ పదవి వచ్చినా నా ప్రాంతాన్ని మర్చిపోను’ అని తెలిపారు.
జైపాల్ రెడ్డి రాజకీయ నేత కాదు.. సిద్ధాంతకర్త అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారం ఉన్నా లేకున్నా జైపాల్ రెడ్డి సిద్ధాంతం వీడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పాటుపడ్డారు. ఉత్తమ పార్లమేంటేరియన్‌గా ఎదిగారు. దేశ రాజకీయాలను శాసించే సత్తా కల్వకుర్తికి ఉంది. నేను ఎంత ఎదిగిన నల్లమల్ల బిడ్డనే.. నాకు ఏ పదవి వచ్చినా నా ప్రాంతాన్ని మర్చిపోను’ అని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.