Mahbubnagar

News March 11, 2025

మహబూబ్‌నగర్: అందరికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే యెన్నం

image

అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మాపూర్ గ్రామంలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని తెలిపారు.

News March 11, 2025

MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

image

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

News March 11, 2025

MBNR: మూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

News March 10, 2025

MBNR: చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతి

image

చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News March 10, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 10, 2025

నవాబుపేట : బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం పరారీ

image

నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.

News March 10, 2025

MBNRలో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.

News March 9, 2025

BREAKING: SLBC టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించారు. టీబీఎం మెషీన్‌లో మృతదేహం ఇరుక్కున్నట్టు నిర్ధారించారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. అయితే TBM ముందు భాగంలో దుర్వాసన వస్తున్నందున్నారు. ఆచూకీ కోసం 15 రోజులుగా శ్రమిస్తున్నారు.

News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 9, 2025

SLBC వద్ద భయం.. భయం.!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.