Mahbubnagar

News October 28, 2024

ఉమ్మడి జిల్లా నేటి టాప్ న్యూస్

image

✓NRPT: పెరటి కోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం:కలెక్టర్.✓ ACPT:శాసనసభ పబ్లిక్ అకౌంట్ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే.✓WNP:TSలో డ్రగ్స్ కల్చర్ నిర్మూలనకు కృషి:శివసేన రెడ్డి.✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా TPUS ఆధ్వర్యంలో తహసిల్దార్లకు వినతి పత్రం.✓SDNR:హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.✓ దౌల్తాబాద్ మండలంలో ముసలి కలకలం.✓ గండిడ్: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.✓NRPT:సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు.

News October 28, 2024

షాద్‌నగర్: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడ PSలోని కాసులాబాద్ గ్రామానికి చెందిన రాజు మరణానికి కారణమైన అంజయ్యకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసుల వివరాలు.. 2020లో డబ్బులు విషయంలో గొడవ జరగగా రాజును గొడ్డలితో అంజయ్య హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టు ఈరోజు ఈమేరకు తీర్పునిచ్చింది.

News October 28, 2024

శాసనసభ పబ్లిక్ అకౌంట్ సమావేశంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే

image

హైదరాబాద్ శాసనసభ పబ్లిక్ అకౌంట్ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం- పద్దులు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

News October 28, 2024

MBNRకు ఇంజినీరింగ్, లా కళాశాలలు 

image

PUలో ఇంజినీరింగ్, లా కళాశాలలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రివర్గం ఆమోదించడంతో పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి డా.జీఎన్ శ్రీనివాస్, MLAలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టనున్నారు.

News October 28, 2024

మహబూబ్‌నగర్: భార్య, అత్తపై వేటకొడవలితో దాడి

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో భార్య, అత్తపై అల్లుడు దాడి చేసిన విషయం తెలిసిందే. SI ప్రకారం.. లక్ష్మమ్మ-కుర్మన్న దంపతులు. కాగా, భార్యపై అనుమానంతో కుర్మన్న గొడవ పడి వెళ్లిపోయాడు. కుమార్తె ఒంటరిగా ఉండటంతో తల్లి నిర్మలమ్మ వచ్చింది. నిర్మలమ్మ కుర్మన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మళ్లీ వీరి మధ్య గొడవ జరగగా.. లక్ష్మమ్మపై, అడ్డు వచ్చిన నిర్మలమ్మపై వేటకొడవలితో దాడి చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.

News October 28, 2024

వెల్దండ: వీఓఏపై దాడి.. కేసు నమోదు

image

ఓ ఉద్యోగిపై దాడి జరిగిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. ఎస్ఐ కురుమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని రాచూరు గ్రామానికి చెందిన హైమావతి ఇందిరా క్రాంతి పథకంలో వీవోఏగా పనిచేస్తోంది. గంగదారి కృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు రుణ విషయంలో హైమావతిని అసభ్యంగా మాట్లాడి, దాడి చేశారని PSలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు కృష్ణయ్యపై నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News October 27, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మిడ్జిల్‌లో 36.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట జిల్లాలోని ధన్వాడలో 35.9, మదనపూర్‌లో 35.9, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో 35.5, అలంపూర్‌లో 35.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 27, 2024

MBNR: పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్మశాలి విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్, నీట్ పరీక్ష ప్రతిభ కబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆదివారం అందజేశారు. విద్యార్థులకు నగదు బహుమతి, సర్టిఫికెట్, మెమెంటో అందజేశారు. నిరంతం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని సంఘం నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News October 27, 2024

MBNR: భార్యను కాపురానికి పంపట్లేదని కత్తితో దాడి

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మండలంలోని గుదిబండ గ్రామంలో భార్య, అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశారు. అత్తకు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా తన భార్యను కాపురానికి పంపడం లేదని అతడు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2024

ఈనెల 29న చెస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపిక

image

ఈనెల 29న పాలమూరు యూనివర్సిటీలో స్త్రీ, పురుషుల చెస్, పురుషుల విభాగంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పీయూ PD శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. 17-25 ఏళ్ల వయసు ఉండి, చదువుతున్న కళాశాల బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు సౌత్ జోన్/ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ తమిళనాడులో పాల్గొంటారని సూచించారు.