India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కొడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద జాతర అయిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీని మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.25,54,805 వచ్చినట్లు ఈవో మధుమేశ్వరరెడ్డి చెప్పారు. ఈ బ్రహోత్సవాల్లో హుండీ లెక్కింపు ఇది తొలిసారి. అయితే ఉత్సవాలు ముగిసే వరకు మరో రెండుసార్లు లెక్కించే అవకాశం ఉంది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారుల పర్యవేక్షణలో ఆదాయం లెక్కింపు జరిగినట్లు ఈవో తెలిపారు.
భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. షీటీం ఆధ్వర్యంలో మంగళవారం MBNRలోని మోనప్పగుట్టలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో MP పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల, బాలల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, MLA శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర, SP జానకి పాల్గొన్నారు.
ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్-3 పరీక్ష జిల్లాలో సజావుగా నిర్వహించాలని MBNR అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. MBNR, దేవరకద్రలలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.
వెల్దండ మండలం మహాత్మాగాంధీ తండా సమీపంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. రాజు అనే వ్యక్తిని అతని భార్య హిమబిందు, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.
MBNR జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 8-14, అండర్-17 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే వారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉ.10 గంటలకు హాజరు కావాలని కోరారు.
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో జిల్లా ఇంటర్ అధికారి (DIEO) పోస్టులు మంజూరు చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఎక్కడా జిల్లా ఇంటర్ అధికారి పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లతో నెట్టుకు వస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి ఇంటర్ విద్య గాడి తప్పుతోందని విమర్శలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.