India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారని.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని చులకనగా చూస్తున్నారని విమర్శించారు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేటలో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కాగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
దౌల్తాబాద్ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన అంజిలప్ప(47) కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. అంజప్ప వ్యవసాయంతో పాటు గ్రామంలో మైనర్ కరెంటు రిపేర్లు చేస్తాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కిష్టయ్య ఇంట్లో కరెంటు రాకపోవడంతో రిపేరు చేసేందుకు స్తంభం ఎక్కాడు. షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. చికిత్స కోసం అంజిలప్పను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ పేర్కొన్నారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జపానీ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించి పత్తి పంటను పరిశీలించారు. సేంద్రియ సాగు ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. గతంలో ఆవు పేడ మూత్రంతో పైర్లలో స్ప్రే చేసి అధిక దిగుబడితోపాటు రసాయనాలు లేని పంటలు పండించారని ఆయన చెప్పారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేక పోతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు సర్వీస్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన రైతు సింగారపు స్వామి(33) ట్రాక్టర్‌తో తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరువుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మొగల్ మట్కాలో 3.0 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 1.8 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 0.8 మి.మీ, గద్వాల జిల్లా అలవలపాడులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వివరాలు ఇలా(కోట్లలో).. ✒పాలమూరు-రంగారెడ్డి:రూ.1,285 ✒కల్వకుర్తి: రూ.715 ✒జూరాల-పాకాల కాలువ: రూ.0.15 ✒భీమా జూరాల-పాకాల: రూ.32 ✒జూరాల రాజీవ్:రూ.8 ✒నెట్టెంపాడు: రూ.105 ✒ఆర్డీఎస్: రూ.29.50 ✒సంగంబండ: రూ.188.07 ✒కోయిలసాగర్: రూ.429.86 కోట్లు కేటాయించారు.
పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన కౌశిక్(21) బీఎస్సీ చదువుతున్నాడు. మొదటి సం.లో ఫెయిల్ కావడంతో మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మహబూబ్ నగర్‌లో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ రాత పరీక్షకు 665 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష లకు 728 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 63 మంది హాజరుకాలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.