India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని DSA స్టేడియంలో ఈనెల 29న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్-14,అండర్-17 విభాగంలో బాల,బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్,ఆధార్ కార్డు జిరాక్స్ లతో హాజరు కావాలని కోరారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష జరిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఇంకా ఎన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలన్నారు. సన్న రకం ధాన్యం సేకరణలో అధికారులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు.
అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన జట్టుకు ట్రోఫీని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 26న సోమశిల-శ్రీశైలం క్రూయిజ్ టూర్ ప్రారంభించనున్నట్లు తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలం సింగిల్ రైడ్‌తో పాటు, రౌండ్ అప్ రైడ్ కు సంబంధించి రేట్లు నిర్ణయించారు. సింగిల్ జర్నీ పెద్దవారికి రూ.2000, చిన్నపిల్లలకు రూ. 1000, రౌండప్ జర్నీకి పెద్దవారికి రూ.3000, చిన్నపిల్లలకు రూ. 2,400గా ధర నిర్ణయించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో బోట్ షికారు చేయనుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది సిబ్బందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరు ఆయా కళాశాలల్లో బాధ్యతలు స్వీకరించేందుకు 15 రోజులు గడువు ఇస్తూ ఇంటర్ ప్రాంతీయ సంచాలకులు ఉత్తర్వులు జారీచేశారని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. పదోన్నతులు లభించడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. అత్యధికంగా నారాయణపేట జిల్లా ధన్వాడలో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 36.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 35.9 డిగ్రీలు, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 35.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వటవర్లపల్లి లో 31.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలలో వనపర్తి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు సాయిలీల, లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో తీసుకున్న కర్తవ్యాలపై, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికైన సాయిలీల, లక్ష్మి లను పలు ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నేతలకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కూడా కాకముందే ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించామని తెలిపారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో శ్రీశైలం జలాశయం రెండు గేట్లను బుధవారం మూసివేశారు. శ్రీశైలానికి మొత్తం 142518 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 65,568 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయంలో ప్రస్తుతం 884.5 అడుగుల వద్ద 212.91 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉడగా.. ప్రస్తుతం 8.73 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Sorry, no posts matched your criteria.