Mahbubnagar

News December 19, 2024

PU: ‘ప్రపంచీకరణలో ఇంగ్లీష్ అందరికీ అవసరం’

image

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికి అవసరమని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన ఆంగ్ల భాష ఔన్నత్యంపై ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఆంగ్ల భాషకు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడిందని వెల్లడించారు.

News December 19, 2024

జాతీయ శాస్త్రవేత్తగా పాలమూరు బిడ్డ ఎంపిక

image

పాలమూరుకు చెందిన డా. కొత్తూరు గ్రీష్మా రెడ్డి ఐకార్ భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. కోయిలకొండ మం. వింజమూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న దంపతుల కూతురు గ్రీష్మారెడ్డి నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగం శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలని ఆదుకోవడమే లక్ష్యమని గ్రీష్మా అన్నారు.

News December 19, 2024

MBNR: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్ల కృషి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమం కింద బ్యాంకు రుణం బ్యాంకు లీకేజీ ద్వారా విరివిగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి 45.78 రుణ లక్ష్యం సాధించామన్నారు.

News December 18, 2024

కోడంగల్‌లో BRS శ్రేణుల సంబరాలు

image

లగచర్ల ఘటనలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రైతులకు బుధవారం HYD నాంపల్లి కోర్టు మెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ నాయకుడు నరేందర్ రెడ్డి, రైతులకు అండగా నిలిచిన హరీష్ రావు, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 18, 2024

మిడ్జిల్: పెట్రోల్ పోసుకొని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. ఎస్ఐ శివ నాగేశ్వర్ నాయుడు వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక (17)జడ్చర్లలో ఇంటర్ చదువుతోంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. చికిత్స పొందుతూ మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

News December 18, 2024

MBNR: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

image

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అనసూయ భర్త నుంచి విడిపోయి కొడుకుతో జీవనం సాగిస్తోంది. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందారు. ఆ రోజు నుంచి మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తమ్ముడు వెంకటరమణ ఫిర్యాదు చేశారు.

News December 17, 2024

MBNR: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

image

ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. MBNRలో 20,584 మందికి 54 కేంద్రాలు, NGKLలో 9,731 మందికి 32 , గద్వాలలో 8,722 మందికి 25, WNPలో 8,569 మందికి 31 కేంద్రాల్లో NRPTలో 3,994 మందికి 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలువురు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. పోలీసుసు పటిష్ఠ బందోబస్తు నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికాలులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.

News December 17, 2024

గ్రూప్-2లో మన పాలమూరుపై ప్రశ్నలు

image

TGPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో పాలమూరు జిల్లాపై ప్రశ్నలు వచ్చాయి. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యులు, గంగాపూర్, మన్యంకొండ, పిల్లలమర్రి దేవాలయాలు, సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, గోరేటి వెంకన్న, కిన్నెర మొగులయ్య, నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిపై పలు ప్రశ్నలు వచ్చాయి. తమ ప్రాంతం నుంచి ప్రశ్నలు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 17, 2024

MBNR: గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతం: కలెక్టర్

image

జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఇవాళ ఆమె సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలను కల్పించినట్లు ఆమె తెలిపారు.

News December 16, 2024

ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

image

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు అనేది తెలియదని, శ్రీహరికి మంత్రి పదవి రావడం మాత్రం ఖాయమని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.