India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజోలికి చెందిన శివ(26) మంగళవారం రాత్రి బైక్ పైనుంచి పడి మృతిచెందారు. కుర్వ మద్దిలేటి చిన్న కొడుకు శివ వెళుతూ బైక్ అదుపు తప్పడంతో కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య లక్ష్మి నిండు గర్భిణీ కాగా నేడు తెల్లవారుజామున పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సారి పుట్టిన బిడ్డను చూసుకోకుండా తండ్రి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 1,690 కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాలను నిర్మించింది. ఒక్కో కేంద్రానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.42.23 కోట్లు ఖర్చు చేసింది. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా స్వచ్ఛతను సాధించే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టి నిధులు విడుదల చేసింది. సిబ్బంది లేకపోవడంతో ఆ కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌లో స్కిన్‌లెస్ KG రూ. 200కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ KG రూ. 243, విత్ స్కిన్ KG రూ. 213గా ధర నిర్ణయించారు. రిటైల్‌లో రూ. 147, ఫాంరేటు ధర రూ. 125 ఉంది. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.
భద్రాది కొత్తగూడెంలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో వనపర్తి జిల్లా మహిళా సమస్యలపై రిపోర్ట్ ను వనపర్తి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ప్రవేశపెట్టారు. వనపర్తి జిల్లాలో మహిళాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్లో మరింత మహిళా రక్షణ హక్కులకై పోరాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 మండలాల్లోని మొత్తం 2013 గ్రామ సమైక్య సంఘాల పరిధిలో 40 వేల పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 5 లక్షల మందిపైగా మహిళా సభ్యులు ఉన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందజేయడంతో పాటు వారికి రూ.10 లక్షల బీమాను ప్రభుత్వం ఇస్తుంది. దీని పట్ల అవగాహన లేక పలువురు బీమాను కోల్పోతున్నారు. బీమాపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
పెబ్బేరులో ఏసీబి అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ACB అడిషనల్ SP శ్రీకృష్ణ గౌడ్ వివరాలు.. మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ నుంచి 2023లో కాంట్రాక్టర్ చేసిన పనులకు దాదాపు రూ. 2లక్షల 50వేలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. ఇందుకు గాను కమిషనర్ రూ.25వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ACBని ఆశ్రయించడంతో దాడులు చేపట్టామని చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లా ధన్వాడలో అత్యధిక ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలుగా నమోదైంది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో 36.4 డిగ్రీలు, గద్వాల జిల్లా అలంపూర్‌లో 35.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా సిరి వెంకటాపూర్లో 36.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలో 34.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీకి చిక్కారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. వారికి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, పలువురు అధ్యాపకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి కల్పనకు ఉపయోగపడే కోర్సులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని, మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.
దేశ రక్షణ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 214 మంది పోలీసులు అమరులు అయ్యారని వారందరిని స్మరించుకోవడం మన విధి అన్నారు.
Sorry, no posts matched your criteria.