Mahbubnagar

News June 17, 2024

MBNR: సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDలోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గలవారు http://tsstudycircle.co.in లో ఈనెల 17 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT..

News June 17, 2024

మహబూబ్‌నగర్: నేడు బక్రీద్.. ప్రత్యేక ప్రార్థనలు ఇలా

image

వానగట్టు వక్స్-ఎ-రహమానియా ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు జామా మసీదు నాయబ్ ఇమాం సయ్యద్ ముజాహెద్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జామా మసీదు నుంచి ప్రదర్శనగా వేలాది మంది ముస్లింలు వానగట్టు ఈద్గా మైదానానికి చేరుకుంటారు. ఈ ర్యాలీ ఆకుల చౌరస్తా, గడియారం, పాత బస్టాండు, కలెక్టర్ బంగ్లా చౌరస్తా, బోయపల్లి గేట్ మీదుగా వానగట్టు ఈద్గాను చేరుకుని 8.30 గంకు నమాజు నిర్వహిస్తారు.

News June 17, 2024

NMMS ప్రతిభా పరీక్షలో పాలమూరు విద్యార్థుల సత్తా

image

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌-NMMS ప్రతిభా పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. 2023-24 ఏడాదికి మొత్తం 620 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 257 మంది ఎంపికయ్యారు. ఇందులో MBNR జిల్లా నుంచి అధికంగా ఉన్నారు. దీంతో 5 జిల్లాల పరిధిలోని 257 మందికి 4ఏళ్లలో రూ.1.23 కోట్లు స్కాలర్‌షిప్‌ రూపంలో అందనున్నాయి. ఇవి వారి స్టడీకి ఎంతగానో ఉపయోగపడనుండగా, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది.

News June 17, 2024

వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొవాలి: కలెక్టర్ విజయేంద్ర

image

విద్యార్థినీలు తాము ఎంచుకున్న వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొని కష్టపడి చదవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర అన్నారు. ఆదివారం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ, మైనార్టీ బాలికల విద్యాలయం, అర్బన్ జూనియర్ కళాశాలను సందర్శించారు. కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించాలని, ఆసక్తి ఉన్న రంగంలో రాణించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం వంట గదిని పరిశీలించి, మెనూ తెలుసుకున్నారు.

News June 16, 2024

ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య, రాగాయిపల్లి చెందిన గిరి ఇద్దరూ కలిసి బైక్ పై ఆమనగల్లు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాడుగుల రోడ్డులో 2 బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

MBNR: రుణమాఫీపై రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి . అయితే రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. 

News June 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 37.7, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో 36.7, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 36.5, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 36.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.

News June 16, 2024

MBNR: ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన MBNR జిల్లా పరిధి ధర్మాపూర్ సమీపంలో జరిగింది. SI విజయ్ కుమార్ కథనం మేరకు.. తౌసిప్(20) అనే వ్యక్తి తోటి విద్యార్థి ఖలీలతో కలిసి ఓ ఇంజినీరింగ్ కళాశాల నుంచి బైకుపై ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో ధర్మాపూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తౌసిప్ మృతి చెందగా.. ఖలీల్ చికిత్స పొందుతున్నాడు.

News June 16, 2024

బిజినేపల్లి: నీటి గుంతలో పడి రైతు మృతి

image

నీటి గుంతలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి (48) తన పొలంలో నీటి గుంతలో అమర్చిన మోటర్‌కు పట్టిన నాచును తొలగించి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి పొలానికి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 16, 2024

వనపర్తి: వచ్చే నెల 7న నూతన కలెక్టర్ వివాహం

image

ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉన్న ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాకు కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కుదరగా, వచ్చే నెల 7న వివాహం చేసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన త్వరలో కలెక్టర్ హోదాలో ఇంటివాడు కానున్నారు. కాగా.. ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్న తేజస్ నందాల్ పవార్ గతేడాది కలెక్టర్ హోదాలోనే వివాహం చేసుకున్నారు.