Mahbubnagar

News June 15, 2024

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేటి “ప్రధానాంశాలు”

image

√ ఊట్కూర్: భూ తగాదాల కారణంగా హత్య:ఎస్పీ.
√NGKL:నూతన కలెక్టర్ గా సంతోష్.
√NRPT:నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్.
√MBNR:నూతన కలెక్టర్ గా బి.విజయేంద్ర.
√WNP:నూతన కలెక్టర్ గా ఆదర్శ్ సురభి.
√ నీతినిబద్ధతతో అధికారులు సేవలు అందించాలి: మంత్రి జూపల్లి.
√ నందిగామ: పట్టపగలు దేవాలయంలో చోరీకి యత్నం.
√ మన్యంకొండ, చిన్న రాజమూరు అంజన్నను దర్శించుకున్న ఎంపీ DK.అరుణ.
√నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు.

News June 15, 2024

నీతి, నిబద్ధతతో అధికారులు సేవలు అందించాలి: జూపల్లి

image

నీతి, నిజాయితీ నిబద్ధతతో అధికారులు ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పెద్దకొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గదులు పుస్తకాలు, దుస్తులు, భోజనం, తగినంతమంది టీచర్లను నియమిస్తామన్నారు. ఎంపీ మల్లురవి, ఎంపీపీ పాల్గొన్నారు.

News June 15, 2024

చిన్నపొర్లలో భారీగా పోలీసుల మోహరింపు

image

ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూతగాదాలతో నిన్న సంజప్ప హత్యకు గురైన విషయం విదితమే. కాగా నేడు సంజప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

News June 15, 2024

మహబూబ్‌నగర్: సాగుకు సిద్దమవుతున్న రైతన్నలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల కింద ముందస్తు సాగుపై ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జూరాలకు వరద నీరు వస్తుండటంతో జలాశయంలో నీటినిల్వ పెరుగుతూ వస్తోంది. నెట్టెంపాడు ఎత్తిపోతలతో పాటు ఉమ్మడి జిల్లాలోని జూరాల అధారంగా ఉన్న ఎత్తిపోతల నుంచి నీటితోడిపోత మొదలైంది. దీంతో రైతులు సాగుకు సిద్దమవుతున్నారు.

News June 15, 2024

మగ పిల్లలు పుట్టలేదని వివాహిత సూసైడ్

image

మగపిల్లలు పుట్టలేదని, పుట్టిన ఒక కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందని మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన జడ్చర్ల మండలంలో  జరిగింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన అపర్ణకు ఆలూరుకు చెందిన మైబుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఈనెల 13న భర్త మేస్త్రీ పనికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

News June 15, 2024

మద్యం మత్తులో జ్వరం టాబ్లెట్లు వేసుకొని వ్యక్తి మృతి

image

మద్యం తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు మింగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బొంరాస్ పేట మండలం మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేష్(32) తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల చనిపోయాడు. ఈ మేరకు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 15, 2024

నారాయణపేట జిల్లాలో భూ హత్యపై హరీశ్ రావు ట్వీట్

image

ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు.. X వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News June 15, 2024

‘ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ విట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో గద్వాల కలెక్టర్ సంతోష్‌తో పాటు అన్ని మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు. ధరణి సమస్యలు పరిష్కారంపై అందరూ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ సూచించారు. వారం రోజుల్లో జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు.

News June 14, 2024

ఉమ్మడి జిల్లా “TODAY TOP NEWS”

image

√NRPT: ప్రత్యర్థుల దాడి ఘటనలో వ్యక్తి దారుణ హత్య.
√ ఊట్కూరు ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.
√ పార్లమెంటులో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ.
√ ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసిన ఎస్పీ.
√ పర్యాటక రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి: మంత్రి జూపల్లి.
√ తెలంగాణ హక్కులపై చంద్రబాబు కుట్ర: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
√ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా బీసీ మేధావుల సంఘం.

News June 14, 2024

నారాయణపేట జిల్లాలో భూ హత్యపై హరీశ్ రావు ట్వీట్

image

ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు.. X వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.