India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో.. శుక్రవారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వివిధ రూపాల్లో మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 90 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 6 జట్లను ఎంపిక చేశామని, ఎంపికైన జట్లతో ఈ నెల 21 నుంచి 28 వరకు పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు.
యువతి అదృశ్యమైన ఘటనలో కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ నాయక్ తెలిపారు. బల్మూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం పెళ్లిచూపులు జరగాల్సి ఉండగా గురువారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా అదృశ్యమైంది. తెల్లవారుజామున గమనించిన తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.
మాడ్గుల్ మండలంలోని అంతంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై 22 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్రెల యజమానులు మేత కోసం తమ మూగజీవాలను పొలాలకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన యాటెల్లి రాములుకు చెందిన 12 గొర్రెలు, ముచర్ల చిన్న బక్కయ్యకు చెందిన 10 గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు చెప్పారు.
పీయూ VCగా రానున్న GN శ్రీనివాస్‌ది కరీంనగర్ జిల్లా గంభీరావ్‌పేట(M) కొత్తపల్లి. ఆయన 1-10వ తరగతి వరకు గంభీరావ్‌పేట, ఇంటర్ కామారెడ్డి, బీటెక్-JNTU, ఏఈ-OU, HD పట్టా JNTU నుంచి అందుకున్నారు. JNTUలో UGC మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా, 77-ఎంటెక్,28-బీటెక్ ప్రాజెక్టులకు గైడ్‌గా వ్యవహరించారు. ‘ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఆన్ మెస్యూరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్’ ప్రత్యేక లెక్స్ బుక్ రచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసి, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?
ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్ SP సీహెచ్ రామేశ్వర్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మహిళల రక్షణ, యాంటీ ర్యాగింగ్ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు ఇబ్బందులకు గురైన సమయంలో పోలీసులతోపాటు షీ టీం సభ్యులను సంప్రదిస్తే వారు మీ వివరాలను గోప్యంగా ఉంచి సమస్య పరిష్కరిస్తారని అన్నారు. సమావేశంలో SI రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ ITI(బాలికల) కళాశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన 6 కొత్త కోర్సుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ..ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 వరకు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, బాలికలు మాత్రమే అర్హులని, SSC మెమో,TC, బోనఫైడ్, క్యాస్ట్, ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
పేదలు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చునని వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి M.R. సునీత తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100, గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉచితంగా న్యాయ సేవలు, సలహాలు పొందగోరు వారు టోల్ ఫ్రీ నంబర్ కానీ https://www.nalsa.gov.in/Isams/ ను సంప్రదించవచ్చు అన్నారు.
✒PU VCగా శ్రీనివాస్ నియామకం
✒బిజినపల్లి:రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
✒MBNR:రేపు కరాటే ఎంపికలు
✒ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం
✒MBNR:రూ.1.73 కోట్ల నిధులు స్వాహా..పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
✒దసరా EFFECT..RTC నడపడంలో పాలమూరు టాప్
✒పలుచోట్ల డ్రంక్&డ్రైవ్
✒వనపర్తిలో సీఎం కప్ -2024 రిలే ర్యాలీ
✒గ్రూప్-3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
✒U-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
Sorry, no posts matched your criteria.