Mahbubnagar

News October 18, 2024

పాలమూరు యూనివర్సిటీ VCగా శ్రీనివాస్ నియామకం

image

పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతి(VC)గా ప్రొఫెసర్ GN శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్.. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ OUలో పూర్తి చేశారు. ఆయన JNTU ప్రొఫెసర్‌గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేశారు. OUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, JNTU సుల్తాన్‌పూర్ ప్రిన్సిపల్‌గా పని చేశారు.

News October 18, 2024

NGKL: సర్వం సిద్ధం.. రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

image

ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లను ఈనెల 19న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి విలియమ్స్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డులతో హాజరుకావాలని, ఎంపికైన జట్లు రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖోఖో టోర్నమెంట్‌లో పాల్గొంటారని అన్నారు.

News October 18, 2024

ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం

image

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. మొఘల్‌రాజుల ప్రాబల్యం పెరుగుతున్నతరుణంలో వారి ఆధిపత్యం అంతమొందించడంతోపాటు జమీందార్లు, జాగీర్దార్ల దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను పాపన్నగౌడ్‌ ఎగురవేశారని మంత్రి గుర్తుచేశారు.

News October 18, 2024

MBNR: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

image

హన్వాడ మండలం అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ శుక్రవారం అధికారులు సస్పెండ్ చేశారు. శివప్రకాశ్ గతంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన పని చేసిన కాలంలో రూ.1.73 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గత నెలలో జరిపిన DPLO విచారణలో తేలింది. ఈ మేరకు సస్పెన్షన్‌కు గురయ్యారు.

News October 18, 2024

ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి…అనంతలోకాలకు

image

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన <<14388888>>పెద్దకొత్తపల్లి <<>>మండలం వెన్నచర్ల గ్రామ శివారులో జరిగింది. స్థానికుల వివరాలు.. అదే గ్రామానికి చెందిన సందడి శైలేష్(19) పంట పొలంలో పురుగు మందు పిచికారి చేసేందుకు తన ఇద్దరి స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు.

News October 18, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 29.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా కేంద్రంలో 15.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 11.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా నర్వలో 7.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 18, 2024

సనాతన ధర్మ పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన మల్లేశ్ దేశంలోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాల దర్శనార్థం గురువారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పాలమూరు నుంచి తాండూరు మార్గంలో యాత్ర సాగనుంది. రోజుకు 100 కి.మీ.లు సైకిల్ యాత్ర చేసి స్థానిక ఆలయాల్లో బస చేస్తానని తెలిపాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ యాత్ర కొనసాగించనున్నట్లు అతడు పేర్కొన్నాడు.

News October 18, 2024

కులగణనకు సిద్ధం.. తరువాతే స్థానిక ఎన్నికలు

image

కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని అంచనా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 2 నెలల్లోపే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన సమగ్ర సర్వేలో జనాభా 42,84,024 ఉండగా, 9,67,013 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు.

News October 18, 2024

MBNR: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

News October 18, 2024

MBNR: దసరా EFFECT..రాష్ట్రంలోనే మనమే NO:1

image

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(OR) 104% సాధించి అగ్రస్థానంలో నిలిచిందని ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పది డిపోల్లో ఓఆర్ సాధించడంతో పాటు 3 బస్ డిపోలు(NGKL,WNPT,GDWL) ఉత్తమ(కిలో మీటరుకు ఆదాయం) ఈపీకేతో పాటు ఓఆర్ అవార్డులకు ఎంపికయ్యాయని, దీంతో అధికారులను,డ్రైవర్,కండక్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించినట్లు తెలిపారు.