Mahbubnagar

News June 13, 2024

MBNR: TETలో 13,399 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు HYDలో బుధవారం విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేపర్-1కు 17,610 మంది, పేపర్-2కు 11,935 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-1లో 15,516 మంది అభ్యర్థుల్లో 10,458 మంది (67.40 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు. టెట్ పేపర్-2లో 9,936 మంది అభ్యర్థుల్లో 2,941 మంది (29.59 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు.

News June 13, 2024

మహబూబ్ నగర్: సీనియార్టీ జాబితా విడుదల

image

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, పదోన్నతుల ప్రక్రియ వడివడిగా కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం నాటికి హెచ్ఎంలకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో స్కూల్ అసిస్టెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సీనియార్టీ జాబితాను వెలువరించినట్లు డీఈఓ రవీందర్ పేర్కొన్నారు. జాబితాను www.palamurubadi.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉందన్నారు.

News June 13, 2024

గద్వాల: పోలీస్ బెటాలియన్‌లో లంచం తీసుకుంటూ చిక్కారు

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి X రోడ్డ్ బీచుపల్లిలోని 10వ బెటాలియన్‌లో రూ.50వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహ స్వామి పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఏఆర్ఎస్సై అబ్దుల్ వహాబ్ సహకారంతో ఓ కానిస్టేబుల్ మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి రూ.50ల లంచం డిమాండ్ చేసిన కేసులో నరసింహ స్వామిని అరెస్టు చేసినట్ల ఏసీబీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి: జడ్జి

image

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీలత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీలత మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.

News June 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు !

image

✒అచ్చంపేట మున్సిపాలిటీని కోల్పోయిన BRS
✒ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ
✒గద్వాల్:14న ఉద్యోగ మేళా
✒విద్యా,వైద్య రంగానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే పర్ణిక
✒APలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం.. ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్స్ సంబరాలు
✒పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి:సిపిఐ
✒ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నామినేటెడ్‌ పదవుల సందడి
✒ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై ఫోకస్

News June 12, 2024

అచ్చంపేట మున్సిపాలిటీని కోల్పోయిన BRS

image

అచ్చంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ నరసింహ గౌడ్ పై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన తన పదవిని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది. కాగా త్వరలో కొత్త ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

News June 12, 2024

NGKL: లింక్ పంపి ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు.. జాగ్రత్త

image

నాగర్ కర్నూల్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మేనేజర్‌ ఫోన్‌కి వారం క్రితం మెసేజ్‌‌గా వచ్చిన లింక్ ఓపెన్‌ చేయగా ఫోన్‌ హ్యాక్‌ చేశారు. బాధితుడి ఫోటోను న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి బెదిరించి రూ.1.56 లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు SI గోవర్దన్‌ తెలిపారు.

News June 12, 2024

MBNR: ‘కాంగ్రెస్‌‌‌లో నామినేటెడ్‌ పదవుల సందడి’

image

MBNR జిల్లా కాంగ్రెస్‌‌లో నామినేటెడ్‌ పదవుల సందడి మొదలైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పార్టీ నేతల్లో అధికార పదవులకు పోటీ నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉన్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ పదవులు ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే.

News June 12, 2024

MBNR: జోరందుకున్న రైతన్నల సాగు

image

పాలమూరులో వానాకాలం సీజన్‌ జోరందుకుంది. జూన్‌ 1 నుంచి ఉమ్మడి MBNR జిల్లాలో 60-80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 15-30 సె.మీటర్లు తడవడంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి, మొక్కజొన్న, జొన్న, మినము వంటి పంటలపై దృష్టి పెడుతున్నారు. రైతులు పత్తిపై మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్‌ పాలమూరులో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

News June 12, 2024

MBNR: ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌కు కావలసిన సర్టిఫికెట్స్!!

image

✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో. ✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి. )✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. ✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో. ✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి. ✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ ‌కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది. SHARE IT..