India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో 26 సార్లు పశువుల దొంగతనానికి పాల్పడిన దొంగలు 27వ సారి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు దొంగలు గత కొంతకాలంగా కల్వకుర్తి, దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటర్ కమిషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబ్ నగర్ సర్కిల్ పరిధిలో 8, జడ్చర్ల డివిజన్ 23, దేవరకద్ర 3, రాజాపూర్ 3 ఫిర్యాదులు అందాయని SE రమేశ్ తెలిపారు. వాటి పరిష్కారానికి విద్యుత్తు అధికారులు సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
వంగూరు మండలంలోని వంగూరు గేట్ దగ్గర నివాసం ఉంటున్న రమేశ్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు సత్యదేవ్(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని నీటి సంపు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని టీజీ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి MBNR జిల్లా అండర్-23 క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం.రాజశేఖర్ తెలిపారు. డేవిడ్ కృపాల్(C), MD.షాదాబ్, అబ్దుల్ రఫీ, MD.ముఖీత్, MD.అద్నాన్, అభిలాష్ గౌడ్, కొండా శ్రీకాంత్, అరవింద్, ఛత్రపతి, జస్వంత్, తరుణ్, ప్రణీత్, అక్షయ్, అంజి, శ్రీకాంత్‌లు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు వరంగల్‌లో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు.
గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. లింగాలకు సొంత పనుల మీద వచ్చిన ఓ వ్యక్తి ఆకలి వేయడంతో స్థానిక చెన్నంపల్లి చౌరస్తా వద్ద గుడ్లు కొని తింటున్నాడు. ఈ క్రమంలో గుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 42,84,024 ఉండగా.. 9,67,013 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు 56 ప్రధాన ప్రశ్నలు మరో 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సమాచారం సేకరించనున్నారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా త్యాగదొడ్డిలో 34.9 డిగ్రీలు, వనపర్తి జిల్లా అమరచింతలో 33.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 32.1 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 31.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కనకయ్యగౌడ్ వివరాలిలా.. ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన వృద్ధుడు మల్లయ్య మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు అధికారులు అలర్ట్ ప్రకటించారు. నేడు(ఆదివారం) ‘విద్యుత్ వినియోగదారుల దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్ డివిజన్ కార్యాలయంలో 9:00 గంటలకు వినియోగదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.