India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. సుమారుగా 1,23,314 క్యూసెక్కుల వరద వస్తోంది. బుధవారం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 16.415 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, కుడిగట్టు కేంద్రంలో 15.015 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 30,752 క్యూసెక్కులు మొత్తం 66,067 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన మల్దకల్ మండలంలో బుధవారం జరిగింది. మల్దకల్ మండల మాజీ ZPTC పటేల్ అరుణ- ప్రభాకర్ రెడ్డి కుమారుడు రాంచంద్రారెడ్డి ఎర్రవల్లి నుంచి గద్వాల వెళ్తుండగా దయ్యాలవాగు వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందారు.
ఉమ్మడి MBNR నుంచి రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కోసం క్రికెట్ పోటీలు ఉంటాయని MBNR క్రికెట్ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 18న MDCA మైదానంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్-23 ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, వైట్ డ్రెస్‌లో రావాలన్నారు.
గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణస్థాయిలో ఉన్న LRS క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని సూచించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లి లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అలంపూర్ లో 1.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
రాష్ట్ర ప్రభుత్వం శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 220 బృందాలు ప్రధానంగా గేదెలు, ఆవులు, పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. పెంపకందార్లు పశువులకు ఉచితంగా ఈ టీకాలను వేసుకోవాలని అధికారులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 58,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 38,499 క్యూసెక్కులు, 2 గేట్ల ద్వారా 14,128, ఎడమ కాల్వకు 1030, కుడి కాల్వకు 731,సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 94 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రస్తుతం 8.909 TMCల నీరు ఉంది.
పాలమూరు జిల్లాలో డ్రగ్స్ మాఫీయా విస్తరిస్తోంది. MBNR, NRPT, WNP, GDWL జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మత్తు దందాలో యువతతో పాటు విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. గతంలో MBNRలో గంజాయి సిగరెట్లు విక్రయిస్తుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు నుంచి వినిపిస్తున్నాయి.
వనపర్తి జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కంచెలను విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రైతులకు సూచించారు. జిల్లాలో పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా రైతులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రమాద హెచ్చరికలను గుర్తించకుండా కేవలం పంటచేలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.