India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలం గట్టునెల్లికుదురులో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడువ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి సుల్తాన్ మందలించాడు. దీంతో కోపంలో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం గ్రామానికి చెందిన కొల్లంపల్లి హత్య కేసు నిందితులను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. CI రామకృష్ణ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొల్లంపల్లి 6 రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
నా. కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంకి చెందిన తప్పేట రాములు, భార్య ఎల్లమ్మ కొంతకాలంగా అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రి రామస్వామి దగ్గర వలస కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుమారునికి ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన మేస్త్రి పంపకపోవడంతో రాములు పారిపోయి వచ్చాడు. విషయం తెలుసుకున్న మేస్త్రి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వనిదే భార్యను పంపనని వేధిస్తున్నట్లు రాములు చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు(M) ఐతోల్లో కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన పాఠశాలను శనివారం ప్రారంభించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దర్శకుడి సొంత గ్రామమైన ఐతోల్లో విద్యార్థులకు గదుల కొరత ఉందని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తన తల్లిదండ్రుల సహాయ సహకారంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పాల్గొననున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు పోటీ పరీక్షల్లో సత్తాచాడు. ఒకే ప్రయత్నంలో ఏకంగా 5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థుల అభినందనలు పొందాడు. అతడే బిజినేపల్లి మండలానికి చెందిన మాకం ఆంజనేయులు లావణ్య దంపతుల కొడుకు జీవన్ కుమార్. జీవన్ 3 గెజిటెడ్ ఉద్యోగాలు AEE, AE, PLతోపాటు గ్రూప్-4, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం(SSC JE) సాధించాడు. AEE ఉద్యోగంలో చేరుతానని జీవన్ అన్నారు.
పాలమూరులో హైవేల నిర్మాణానికి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,205.975 కోట్లు కేటాయించింది. MBNR-చించోళి రోడ్డు నిర్మాణానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో కొడంగల్ వరకు రూ.379.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాలమూరులో ఇప్పటికే హైవే పనులు జరుగుతున్నాయి. దీంతో HYD-బెంగళూరు హైవేపై ఉన్న 37 బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల అండర్‌పాసు లేదా సర్వీసు రోడ్లు నిర్మించే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఈ క్రింది విధంగా వర్షపాత వివరాలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా ఐనోలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా పుల్లూరులో 18.3 మి.మీ, వనపర్తి జిల్లా రేమద్దులలో 10.3 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 9.5 మి.మీ, నారాయణపేట జిల్లా బిజ్వార్లో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నారాయణపేటకు సమీపంలోని కర్ణాటకలోని సరిహద్దు గ్రామం కందుకూరులో గుట్టపై వెలసిన కొండమేశ్వరి దేవి ఆలయంలో నేడు తేళ్ల పంచమి నిర్వహిస్తారు. దేవి ఉత్సవాల్లో భాగంగా శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచామితి తిథి రోజు(నేడు) తేళ్ల పంచమి నిర్వహిస్తారు. అమ్మవారు, తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అనంతరం అక్కడి రాళ్ల కింద దాగి ఉన్న తేళ్లను పట్టుకొని ఒంటిపై వేసుకుంటారు. ఎక్కడ వేసుకున్నా తేళ్లు కుట్టకపోవడం ఇక్కడి విశేషం.
ఒకే ఇంటి ఆవరణలో 6 పాములను పట్టుకున్న ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. ఉదండాపూర్ గ్రామంలో మేస్త్రీ పనిచేసే సోమయ్య ఇంటి బెస్మెంట్‌లోని రంధ్రంలో పాము కనిపించింది. వారు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సదాశివయ్యకు సమాచారం అందించారు. శిష్యులు రాహుల్, చంద్రశేఖర్‌తో కలిసి వెళ్లిన సదాశివయ్య.. ఆ రంధ్రంలో ఆరు పాములను గుర్తించి పట్టుకున్నారు. అయితే ఆ పాములన్నీ విషరహితమైనవే అని తెలిపారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రథమ,ద్వితీయ, తృతీయ సంవత్సరంలో చేరేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగిందని అధ్యయన కేంద్రం సమన్వయకర్త భాస్కర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరే వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలన్నారు. మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్ష జరగలేదని, అయినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో చేరాలన్నారు.
Sorry, no posts matched your criteria.