India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా IAS, IPS అధికారుల పేరుతో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ల పేరు, ఫొటోలతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు తాజాగా NGKL ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ డీపీతో ఫేక్ ఇన్‌స్టా ఖాతా తెరిచి పలువురికి మెసేజ్‌లు పంపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ.. ఇలాంటి వాటికి స్పందించవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరేడ్ మైదానంలో ప్రజలకు, అతిథులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జండా ఆవిష్కరించాలని చెప్పారు.
చిన్న పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్లు నిరాకరణ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను సవాలు చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన తాటికొండ కృష్ణ అనే జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం కాదని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
BJPలో BRS విలీనం అవుతోందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా..? మేం రాకూడదా..?. MLAల అనర్హతపై సుప్రీం కోర్టులో కొట్లాడడం కోసమే ఢిల్లీకి వచ్చాం. BRS బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నాం. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు కాంగ్రెస్ నేతలు నోటికొచ్చింది మాట్లాడొద్దు.’ అని హెచ్చరించారు.
భర్త దశదినకర్మ రోజే భార్య మృతి చెందిన ఘటన పానగల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కేతేపల్లికి చెందిన మీనుగ చిన్న కిష్టయ్య(80) పది రోజుల క్రితం భోజనం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణించారు. కాగా, నేడు ఆయన దశదినకర్మ కార్యక్రమం నిర్వహిస్తుండగా భార్య లక్ష్మీ దేవమ్మ(75) హఠాత్తుగా కుప్పకూలింది. భార్త మృతి చెందిన 10 రోజులకే భార్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. ఊట్కూరు మం. ఏర్గడ్‌పల్లికి చెందిన సుజాత పాము కాటుకు గురైంది. ఆమెను అభినవ్(24) బైక్ పై చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. దత్తసాయి కాలేజ్ సమీపంలో అడ్డొచ్చి ఎద్దులను తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో అభినవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సుజాతను ఆస్పత్రికి తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెగుచూసింది. ఓ కామాంధుడు ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 19.8 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింత 19.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా వటవర్లపల్లిలో 14.0 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
భార్యకు వీడియో కాల్ చేసి RMP డాక్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన గద్వాలలో బుధవారం జరిగింది. SI వెంకటేశ్ వివరాలు.. జమ్మిచేడుకు చెందిన భాస్కర్‌యాదవ్ RMPగా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నాడని నమోదైన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భాస్కర్ HYDలో పిల్లల వద్ద ఉన్న భార్యకు వీడియో కాల్ చేసి కోర్టు కేసు, పలు సమస్యలతో బతకాలనిలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.