Mahbubnagar

News August 8, 2024

ఊట్కూర్: పెద్దవాగులో భారీ చేప లభ్యం

image

NRPT: ఊట్కూరు మండలంలోని కర్ణాటక సరిహద్దు సంస్తపూర్, ఇడ్లూరు పెద్దవాగుకు భారీ వర్షాలకు వరద ఉద్ధృతి వస్తోంది. దీంతో సంగం బండ జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహానికి భారీ చేపలు కొట్టుకు రావడంతో పరిసర గ్రామాల యువకులు పెద్ద ఎత్తున చేపలవేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడికి 8 కిలోల చేప చిక్కింది. ఎక్కువ మొత్తంలో పెద్ద సైజు చేపలు చిక్కుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

News August 8, 2024

MBNR: స్థానిక పోరు.. జిల్లాల వారీగా వివరాలు !

image

త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు సర్కారు యోచిస్తోంది. CM రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నేపథ్యంలో గ్రామస్థాయి నేతల్లో ఆశలు చిగురించాయి. గ్రామాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 468, నాగర్ కర్నూల్-461, గద్వాల్-255, వనపర్తి-255, నారాయణపేట-280 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నేతలు నువ్వా.. నేనా అంటూ స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

News August 8, 2024

కేంద్రం బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి: శ్రీనివాస్ గౌడ్

image

కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన వెంటనే చేపట్టాలని మాజీమంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమాల్లో మాజీ మంత్రి బుధవారం రాత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ కుల గణన ఇతర బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ విద్య ఉద్యోగ వేదికలను బీసీలకు ప్రాధాన్యం లభించడం లేదని ఆయన పేర్కొన్నారు.

News August 8, 2024

తపాలా కార్యాలయంలో రూ.25కే జాతీయ జెండా

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.25లకే జాతీయ జెండాను అందజేస్తున్నట్లు తపాలా శాఖ మహబూబ్ నగర్ డివిజన్ పర్యవేక్షకురాలు ఎస్. విజయజ్యోతి తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాల్లో తివర్ణ పతాకాలను అందుబాటులో ఉంచామని, రూ.25 చెల్లించి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://www.epostoffice.gov.in ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే తమ సిబ్బంది ఇంటికే వచ్చి అందజేస్తారన్నారు.

News August 8, 2024

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డ్యాం 39గేట్లు ఎత్తి 2.64 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ఔట్ ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సంగంబండ జలాశాయం గేట్లు ఎత్తడంతో మరింత వరద పెరిగి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సుంకేసులలో 10 గేట్లు, సంగబండ రిజర్యాయర్ 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

News August 7, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు భారీ వర్షాలు!

image

మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

News August 7, 2024

ప్రపంచ నలుమూలలా గద్వాల గౌరవం!

image

గద్వాల నేత చీరలు దేశ, విదేశి వనితల ఆదరణ పొందుతూ పాలమూరు గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివాహాది శుభకార్యాలకు మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఒక్కో చీర రూ.1000 నుంచి రూ.2లక్షల వరకు పలుకుతాయి. ఏటా దసర బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు గద్వాల నుంచే వెళ్తాయి. కాగా.. గద్వాల జరీ చీరలకు 2008లోనే జీఐ ట్యాగ్ లభించింది.

News August 7, 2024

జడ్చర్ల: గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

image

జడ్చర్ల మండలం నాగసాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో పలవురు విద్యార్థులు ఇబ్బంది పడటంతో వారిని పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేద్ర బోయి పాఠశాలను సందర్శించి పిల్లలకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెంట్లవెల్లి KGBVలో విద్యార్థినులు ఆస్వస్థతకు గురైన 2రోజుల్లోనే ఈ ఘటన జరగడం బాధాకరం.

News August 7, 2024

జూరాలకు 2.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

కృష్ణా నదిలో వరద కొనసాగుతుంది. జూరాల 30 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2.49 లక్షల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 2.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. 9.65TMCలకు 9.09TMCల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తారు. స్పిల్ వే ద్వారా 3.11 లక్షల క్యూసెక్కులు వదులుతుండగా.. ఇన్‌ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 205 TMCల నిల్వ ఉంది. సాగర్‌లో 20గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

News August 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలీలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా గట్టులో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 86.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 82.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా గోపాల్ పేట పేటలో 71.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా వట్వర్లపల్లిలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.