India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్‌లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడల్లో మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సందడి చేశారు. ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్న ఆయన ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ క్రమంలో ఆయనతోపాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డి, వీసీఎండీ సోనీ బాలాదేవి, అధికారులు శానవాజ్, వేణుగోపాల చారి, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) త్రీడే లీగ్‌లో ఉమ్మడి జిల్లా జట్టు వర్సెస్ ఖల్సా జట్ల మధ్య మంగళవారం మూడవ మ్యాచ్ ప్రారంభం అవ్వగా..RR జిల్లా మొయినాబాద్‌లోని SR-1 మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఖల్సా క్లబ్(HYD) జట్టు మొదటి రోజు 86.1 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. జట్టులో చిరాగ్ యాదవ్ 182 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లు అరుణ్ 4, ఎ.శ్రీకాంత్, షాదాబ్ చెరో వికెట్ తీశారు.
MBNR రవాణా శాఖ అధికారులు మంగళవారం టీజీ 06,6666 అనే ఫ్యాన్సీ నంబరుకు ఆన్‌లైన్ వేలం నిర్వహించగా.. 9 మంది వాహనదారులు ఒక్కొక్కరు రూ.30వేల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వేలంలో కె.బాలకృష్ణ అనే వ్యక్తి అత్యధికంగా రూ.5.45 లక్షలకు కోట్ చేయగా అధికారులు ఆయనకు ఆ నంబర్ కేటాయించారు.ఈ నంబరు వేలంతో రవాణా శాఖకు మొత్తం రూ.8.15 లక్షల ఆదాయం సమకూరింది.
అలంపూర్ BRS MLA విజయుడిని పోలీసులు అరెస్టు చేయడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విట్టర్(X) ద్వారా స్పందించారు. ‘ప్రజా పాలనలో మన ప్రజాప్రతినిధులు రోజు అవమానాలకు గురవుతున్నారు. మా ఎమ్మెల్యే విజయుడిని అవమానించిన జిల్లా అధికారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాను. అన్ని అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ప్రజలచే తిరస్కరించబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించడానికి కారణం ఏమిటి?’ అని CSను ట్యాగ్ చేశారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు RTF కోర్సు ఫీజులు విడుదల కాలేదు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. అటు స్కాలర్షిప్ ఇటు కోర్స్ ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీయూ అధికారులు స్పందించి RTFలను విడుదల చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 2నెలల క్రితం ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ చనిపోయిన ఘటన మరువకముందే నిన్న ఓ బాలింత మృతిచెందింది. బాధితుల వివరాలు.. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన కావ్య(24)కు సిజేరియన్ చేశారు. 5 గంటల తర్వాత హడావుడిగా సిబ్బంది అంబులెన్స్‌లో కావ్యను HYDకు తరలించగా అప్పటికే మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతో కావ్య చనిపోయిందని బంధువులు ఆందోళన చేపట్టారు.
చీరకొంగులో చంద్రుడి సంస్కృత శ్లోకాలు.. చీర కొంగుపై గొల్లభామల నాట్యంతో వేసిన చీర.. కోట కొమ్మల పట్టుచీర ఇలా పలు రకాల చీరలను నేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన నైపుణ్యం గల ఏడుగురు నేతన్నలు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపు బుధవారం HYDలో జరిగే వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి నగదు, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోనున్నారు.
గోపాల్‌పేట్ మండల కేంద్రానికి చెందిన మూవీ డైరెక్టర్ జానకిరామ్ ఆర్థిక సమస్యలతో సోమవారం HYDలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జానకిరామ్ తమ్ముడు బాలకృష్ణ భావోద్వేగానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలిసింది. తమ్ముడు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అయోమయంలో పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు బదిలీపై వెళ్లగా నూతన అధికారులు మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ అధికారిగా సీహెచ్ రథసారథి, గద్వాల జిల్లాకు శ్యాంసుందర్, నారాయణపేటకు కృష్ణయ్య, నాగర్ కర్నూల్ జిల్లాకు రామ్మోహన్ రావు.. జిల్లా పంచాయతీ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 7న జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. పద్మావతి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు హాజరు కావచ్చని తెలిపారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా డిగ్రీలో 2019- 2024 వరకు ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.