Mahbubnagar

News October 9, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా…

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.9 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 35.0 డిగ్రీలు, గద్వాల జిల్లా భీమవరంలో 32.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా నర్వలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 9, 2024

రేపు దద్దరిల్లనున్న మహబూబ్‌నగర్

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. MBNR, వనపర్తి, NGKL, గద్వాల, NRPTజిల్లాల్లో రేపు రాత్రి సందడే సందడి. జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 9, 2024

MBNR: మాట వినడంలేదని చంపేశాడు

image

తన మాట వినడం లేదన్న కోపంతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. దేవరకద్రకు చెందిన శ్రీనివాస్ సాగర్, కృష్ణవేణి దంపతులు ఉపాధి కోసం వచ్చి HYD హైదర్షాకోట్‌లో ఉంటున్నారు. వీరు తరచూ గొడవ పడేవారు. మాట వినడం లేదు, తనను పట్టించుకోవడం లేదని భార్యపై శ్రీనివాస్ కోపం పెంచుకున్నాడు. మంగళవారం నిద్రిస్తున్న భార్య తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన శ్రీనివాస్ వెళ్లి PSలో లొంగిపోయాడు.

News October 9, 2024

NGKL: కొల్లాపూర్ ఆర్డీవో సస్పెండ్

image

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని కొల్లాపూర్ RDO నాగరాజును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పద్ధతి మార్చుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినా మారకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కాగ ఆయన 2 నెలల్లో రిటైర్డ్ కానున్నారు. ధరణి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమస్యలకు రైతులకు సరైనా సమాధానం ఇవ్వడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అవినీతి అరోపణలు ఉన్నాయి.

News October 9, 2024

MBNR: డీఎస్సీకి 1,131 మంది ఎంపిక

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,131 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LB స్టేడియంలో CM రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. MBNR-243, గద్వాల-172, NGKL- 285, వనపర్తి-152, NRPT-279 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.

News October 9, 2024

గురుకులాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: RSP

image

నిరుపేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు BRS ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన గురుకుల పాఠ‌శాల‌ల‌ను ర‌ద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని BRS నేత RS ప్ర‌వీణ్ కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం సకల హంగులతో గురుకులాలను నిర్మించి అన్ని వర్గాల పిల్లలకు చదువుకొనే అవకాశం కల్పించిందని RSP గుర్తు చేశారు.

News October 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు..!!

image

✒పర్యాటక రంగంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన: మంత్రి జూపల్లి
✒పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి: విద్యార్థులు
✒DSC-2024 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో అవకతవకులు.. అభ్యర్థుల ధర్నా
✒గణనీయంగా పెరిగిన BSNL.. త్వరలో 4G
✒వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్.. రేపు వర్షాలు
✒ఘనంగా బతుకమ్మ సంబరాలు
✒KCR హయాంలో ఒక విద్యార్థిపై రూ.55 వేలు ఖర్చు చేశాం:RSP
✒మాదక ద్రవ్యాలను అరికట్టాలి:AIYF

News October 8, 2024

బతుకమ్మ సంబరాల్లో గొడవ.. ఆర్మీ జవాన్‌పై దాడి

image

ఆర్మీ జవాన్‌పై కత్తితో ఓ వ్యక్తి దాడి చేయడంతో గాయపడిన ఘటన ధరూర్ (M) రేవులపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామంలోని బతుకమ్మ సంబరాలు జరుగుతుండగా.. కృష్ణ అనే వ్యక్తి సౌండ్ గట్టిగా వస్తుందని బంద్ చేయాలంటూ వాదనకు దిగాడు. వారించడానికి వెళ్లిన ఆర్మీ జవాన్‌పై కృష్ణ కత్తితో దాడి చేయగా.. జవాన్ తీవ్రంగా గాయపడడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News October 8, 2024

MBNR: ‘పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి’

image

చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని చెబుతున్నారు.

News October 8, 2024

మరికల్: రూ.11,11,111 నోట్లతో దుర్గామాత అలంకరణ

image

మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని రూ. 11,11,111 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.