India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డాటా ఎంట్రీలో ఆపరేటర్లు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ ఎంట్రీ సమయంలో ఎన్యుమరేటర్లు ఆపరేటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సిద్ధం చేయాలన్నారు.

✔మొదలైన రైతు పండుగ.. ప్రారంభించిన మంత్రులు
✔ఘనంగా బాపూలే వర్దంతి వేడుకలు
✔రేపు దీక్ష దివాస్.. తరలిరండి:BRS
✔NRPT:కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
✔కొల్లాపూర్‌లో విజయ్ దేవరకొండ సందడి
✔MBNR:RTC RMగా సంతోష్ కుమార్
✔రేపు నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔మిడ్డే మీల్స్ ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి:CITU
✔NRPT:నూతన DEOగా గోవిందరాజులు
✔రైతు సదస్సు..పాల్గొన్న MLAలు,రైతులు

సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్స్ అప్, ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో గురువారం రైతు సంబరాలను మంత్రులు ప్రారంభించారు. ఈ వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వనపర్తి జిల్లాలో 7వ తరగతి <<14725607>>విద్యార్థి సూసైడ్<<>> ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు కొడుకు ప్రవీణ్ మదనాపురం గురుకులంలో చదువుతున్నాడు. మంగళవారం స్కూల్లో కబడ్డీ ఆడుతుండగా ప్రవీణ్ తలకు గాయమైంది. బుధవారం ఉదయం మెడ, తలనొప్పిగా ఉందని తండ్రికి చెప్పగా ఆదివారం వస్తానని బుజ్జగించారు. టిఫిన్ చేసి హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.

నవాబ్‌పేటలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి <<14727126>>విద్యార్థిని జల్సా <<>>పై వేడి నూనెపడి గాయాలైన గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహాశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ల కూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

MBNR జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో గురువారం నుంచి మూడు రోజులపాటు “రైతు పండుగ” ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుధవారం రైతు పండుగ సభకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

ప్రధాని నరేంద్ర మోడీతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని నిర్వహించిన కీలక సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.

న్యూఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.