Mahbubnagar

News October 7, 2024

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం

image

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం అమెరికాలో ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి చేరుకున్న మంత్రికి పలువురు ఎన్నారైలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. 

News October 6, 2024

అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ: కామ్రేడ్ తమ్మినేని

image

అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష్యసాధన కోసం చేయవలసిన కృషిని అనుక్షణం గుర్తు చేసే ఆదర్శ జీవితం కామ్రేడ్ లక్ష్మీదేవమ్మది కొనియాడారు. కామ్రేడ్ అరుణ్, జబ్బార్ ఉన్నారు.

News October 6, 2024

MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.

News October 6, 2024

MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.

News October 6, 2024

NGKL: జీతాలు చెల్లించండి రేవంత్ సారూ..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ జీతాలు చెల్లించాలని సీఎం రేంవత్ రెడ్డిని వేడుకుంటున్నారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జీతాలు రాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఇక బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తుంన్నందున ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

News October 6, 2024

గద్వాల: మెడిసిన్ సీటు సాధించిన పేదింటి బిడ్డ

image

గద్వాల ఎర్రమట్టి వీధికి చెందిన పావని జమ్మన్న దంపతుల కూతురు వైష్ణవి మెడిసిన్‌లో సీటు సాధించింది. విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి బిడ్డలు చదువులో రాణించి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కన్వీనర్ బుచ్చిబాబు పాల్గొన్నారు.

News October 6, 2024

NGKL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పర్యాటక టూర్లు

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పురాతన గుడులు
పర్యటక ప్రదేశాలను చూపించనున్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2,4 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.300/- 5, 8 తరగతుల వారికి రూ.800/-, 9,ఇంటర్, వారికి రూ.2000/-డిగ్రీ విద్యార్థులకు రూ.4000/-చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. 3వేల విద్యార్థులకు అవకాశం దక్కనుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వెల్లడించారు.

News October 6, 2024

జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. శనివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు.
ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 442.534 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు.

News October 6, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడిపోయిన ఉల్లి సాగు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,600 ఎకరాల్లో సాగయ్యే ఉల్లి పంట ఈ సారి 1,200 ఎకరాలకు పడిపోయింది. గత ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకకపోవడంతో ఈ ఏడాది సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగు చేసిన కొద్దిపాటి ఉల్లి పంట కూడా దెబ్బతింది. క్వింటా ఉల్లి ధర జూలైలో రూ.2 వేలు ఉండగా.. సెప్టెంబరులో రూ.5,600 లకు పెరిగింది.

News October 6, 2024

పాలమూరు జిల్లాకు ఎల్లో అలర్ట్⚠️

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.