India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినప్పటికీ ఉద్యమంలో నమోదైన కేసులు ఇప్పటికి మాఫీ కాలేదని మహబూబ్ నగర్ టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సకల జనుల సమ్మె సందర్భంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.
✒ఘనంగా బతుకమ్మ సంబరాలు
✒U-19 టోర్నీ.. ఫైనల్లో పాలమూరు ఓటమి
✒కొల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒దుర్గామాతకు ప్రత్యేక పూజలు
✒మంత్రి సురేఖ మాటలు ముమ్మాటికీ తప్పే:DK అరుణ
✒మన్ననూరులో గద్దర్ విగ్రవిష్కరణ
✒వనపర్తి: లిఫ్టు కాలువలో పడి వ్యక్తి మృతి
✒కోస్గి:ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
✒ధన్వాడ: చిరుత దాడిలో జింక మృతి
✒కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక ఫోకస్
కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లకుంటకు చెందిన తిరుమలేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని బల్మూర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడేు గోరటి అశోక్ కోరారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రధానవక్తలుగా కంచ ఐలయ్య, ఏపూరి సోమన్న, గద్దర్ కూతురు వెన్నెల రానున్నారని ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల నూతన పాలక మండలితో ఆలయ అభివృద్ధి జరుగుతుందా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలో ప్రధాన సమస్యలు.. భక్తులు తమ సామన్లు పెట్టుకోవడానికి లాకర్ సౌకర్యం అందుబాటులో లేదు, అన్నదాన సత్రం ఇరుకుగా ఉంది, ఆలయాల ప్రాంగణంలో భక్తులు సేద తీరడానికీ నిలువు నీడ సౌకర్యం లేదు, ఆలయాలకు పార్కింగ్ వేలం పాట ద్వారా రూ. లక్షల ఆదాయం వస్తున్నా.. వాహనాలు ఎండలో ఉండాల్సిన పరిస్థితి.
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. దీంతో విద్యార్థిని కుటుంబీకులు షీటీంను సంప్రదించారు. వారు కాలేజీకి చేరుకొని సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినితో లిఖితపూర్వక ఫిర్యాదు చేసుకున్నారు. పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని షీ టీం అధికారి వెంకటయ్య తెలిపారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్‌లో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నాను అని ఎంపీ అన్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలు అరుణమ్మను సన్మానించారు.
Sorry, no posts matched your criteria.