Mahbubnagar

News October 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఖమ్మంపై సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
✒మరో 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✒12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
✒రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
✒2వ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
✒పలుచోట్ల బతుకమ్మ సంబరాలు
✒ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు-23,22,054
✒సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త:SPలు
✒DSC-2024..కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన
✒ముమ్మరంగా డిజిటల్ కార్డు సర్వే

News October 4, 2024

MBNR: సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు

image

ఓరుగల్లులో రాష్ట్రస్థాయి U-19 టోర్నీలో ఉమ్మడి MBNR జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం సెమీస్‌లో ఖమ్మం జట్టుపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ల దాటికి ఖమ్మం జట్టు 39.3 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. జిల్లా జట్టు నుంచి అబ్దుల్ రాఫె-110 పరుగులు, MD ముఖిత్ 4 వికెట్లు తీశారు.
#CONGRATULATIONS

News October 4, 2024

12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి

image

దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.

News October 4, 2024

రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

News October 4, 2024

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

image

గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

News October 4, 2024

NGKL: వరి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

వానా కాలంలో రైతులు సాగుచేసిన వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్‌లో 244, నారాయణపేటలో 95 జోగులాంబ గద్వాలలో 55, వనపర్తిలో 244, మహబూబ్‌నగర్లో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.

News October 4, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్టూరులో 84.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 37.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్లో 36.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా దోనూరులో 30.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 4, 2024

అయిజ: ఈ ప్రాంతంలో నీటి సరఫరా నిలిపివేత

image

అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్‌ ప్రాంతాలకు నేడు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని పాత పోలీస్ స్టేషన్ భవనం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యిందని, దానికి మరమ్మతు చేసి కాంక్రీట్ వేశారని, దీంతో శుక్రవారం పాత బస్టాండ్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపేస్తున్నట్లు చెప్పారు.

News October 4, 2024

అచ్చంపేట: మొక్కజొన్న గరిష్ఠ ధర రూ.2,439

image

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ గ్రామాల నుంచి 23 మంది రైతులు 418 క్వింటాళ్ల మొక్కజొన్నను అమ్మకానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు టెండర్ ప్రక్రియ పూర్తవ్వగా.. గరిష్ఠంగా రూ.2,439, కనిష్ఠంగా రూ.1,969, సగటున రూ.2,437 ధరలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ వర్షం పడటంతో మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు 200 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసిపోయిందని అంచనా.

News October 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటరు తుది జాబితా

image

స్థానిక ఎన్నికల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 23,22,054 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,54,128 మంది ఉండగా..11,67,893 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13,765 మంది అధికంగా ఉన్నారు.
1.మహబూబ్ నగర్- 5,16,183
2.నాగర్ కర్నూల్- 6,46,407
3.నారాయణపేట- 4,03,748
4.గద్వాల్- 3,88,195
5.వనపర్తి- 3,67,521