Mahbubnagar

News August 1, 2024

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన

image

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందనో .. అనారోగ్యంతో మరణించిందో తెలియదు కానీ బుధవారం నవజాత శిశువును చెత్తకుప్పలో పడేశారు. ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. అనంతసాగర్ చెరువు సమీపంలోని చెత్తలో రెండు రోజుల క్రితం జన్మించిన శిశువు మృతదేహం లభించిందని తెలిపారు. శిశువును నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News August 1, 2024

UPDATE: శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం అధికారులు బుధవారం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌లోకి నీటిని వదులుతున్నారు. గేట్ల ద్వారా 2.23 లక్షల క్యూసెక్కులు, AP విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 24,917 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 885 అడుగులకు గాను 884.50 అడుగులకు చేరింది.

News August 1, 2024

జడ్చర్ల : ‘అప్పుచేసి ఇల్లు కట్టాను.. ఏడవకండి’

image

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 44వ జాతీయ రహదారికి సమీపంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఇటీవల ఓ ఇంటి యజమాని ఇల్లు కట్టాడు. ఇంటికి నరదృష్టి పడకూడదని ఉద్దేశంతో.. ‘ఇల్లు అప్పు చేసి కట్టాను.. ఏడవకండి’ అని ఫ్లెక్సీ కట్టాడు. దీంతో ఆ ఫ్లెక్సీని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఫ్లెక్సీ చూసిన వారంతా.. ఇలా కూడా ఫ్లెక్సీ కడతారా అంటూ.. నవ్వుకుంటున్నారు.

News August 1, 2024

MBNR: రుణమాఫీ అస్త్రంగా స్థానిక ఎన్నికలకు !

image

రైతు రుణమాఫీని ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరు నుంచే ప్రకటించారు. ఇందులో భాగంగా పంద్రాగస్టు వరకు రూ.2 లక్షల లోన్లు మాఫీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరో పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. రుణమాఫీ అస్త్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేస్తోంది.

News July 31, 2024

శ్రీశైలం జలాశయం UPDATE

image

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 2.93 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఓట్ ఫ్లో 2.84 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 855 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరిందని అధికారులు వివరించారు.

News July 31, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి

image

రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు బుధవారం HYDలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాఘవేంద్రస్వామి శేషవస్త్రంతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

News July 31, 2024

ఉమ్మడి పాలమూరు నేటి ముఖ్య వార్తలు

image

✔NGKL: ఆటో బోల్తా.. 10మందికి గాయాలు
✔3డే లీగ్‌లో ఆకట్టుకున్న పాలమూరు బౌలర్లు
✔రుణమాఫీ.. సీఎం చిత్రపటానికి పాలభిషేకం
✔అర్హులకు పదోన్నతులు: DEOలు
✔NGKL: రేపు కేజీబీవీ సరుకుల టెండర్లు
✔SDNR: రైలు కిందపడి యువకుడి మృతి
✔NGKLలో గంజాయి కలకలం
✔పలుచోట్ల మోస్తారు వర్షం
✔MBNR:కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు
✔సభను తప్పుదోవ పట్టించడమే బీఆర్ఎస్ పని:MLA పర్ణిక రెడ్డి
✔ఓపెన్ టెన్త్, ఇంటర్ దరఖాస్తుల ఆహ్వానం

News July 31, 2024

NGKL: ‘అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలి’

image

అపరిచిత వ్యక్తుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధువారం టీమ్ అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని అన్నారు. విద్యార్ధినులకు సోషల్ మీడియా వాడకంపై గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

News July 31, 2024

SDNR: రైలు కిందపడి యువకుడి మృతి

image

షాద్‌నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. 25-30ఏళ్లు ఉన్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్టేషన్ మాస్టర్ రాహుల్ ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. మృతుడు గ్రే కలర్ రెయిన్ కోర్టు, గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించాడని, ఎవరైనా గుర్తిస్తే షాద్ నగర్ రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

News July 31, 2024

MBNR:1,04,113 రైతులకు..రూ.1,023 కోట్ల రుణమాఫీ

image

రుణమాఫీ రెండో విడతకు సంబంధించి మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో 1,04,113 మంది రైతులను రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.1.50 లక్షల లోపు రుణాలు మొత్తం రూ.1,023 కోట్లు కాగా.. వీటిని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఆగస్ట్ 15 నాటికి మూడో విడత రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.