Mahbubnagar

News July 31, 2024

రుణమాఫీ కాలేదా? ఆందోళన చెందకండి: కలెక్టర్లు

image

అర్హత ఉన్నా రుణమాఫీ కాని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అన్ని మండలాల్లో ఫిర్యాదుల విభాగాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, రైతులు ఫిర్యాదు చేయాలని, దరఖాస్తులను పరిశీలించి, వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు. రెండు విడతలలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మంజూరు కావాల్సి ఉంది.

News July 31, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెంకేశ్వర్ ‌58.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నర్ జిల్లా నవాబ్ పేట 24.3 మి.మీ, గద్వాల జిల్లా ద్యాగదొడ్డిలో 17.3 మి.మీ, వనపర్తి జిల్లా గణపూర్లో 10.8 మి.మీ, నారాయణపేట జిల్లా కోస్గిలో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 31, 2024

మహబూబ్‌నగర్‌లో కన్నీటి ఘటన..!

image

పేదరికం కన్నతల్లి పేగు బంధాన్ని దూరం చేసింది. ఈ విషాద ఘటన MBNR శిశు గృహంలో జరిగింది. MBNRకు చెందిన లింగం, రేణుక దంపతులు. వీరు దినసరి కూలీలు కాగా వీరికి ముగ్గురు పిల్లలు. అయితే భర్త అనారోగ్యంతో ఏడాది క్రితం మరణించాడు. 11 నెలల మూడో కూతురికి పాలు తాగించేందుకు డబ్బులు లేకపోవడంతో రేణుక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాపను సాకలేక మంగళవారం శిశుగృహంలో వదిలిపెట్టి కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

News July 31, 2024

MBNR: ప్రాణాలు తీస్తోన్న తీగలు.. జర జాగ్రత్త..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఏటికేడు పెరుగుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుత్ షాక్‌తో మనుషులతో పాటు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2020లో 80 మంది మనుషులు, 172 పశువులు మృత్యువాత పడ్డాయి. 2021లో 85 మంది మనుషులు, 196 పశువులు, 2022లో 72 మంది మనుషులు, 257 పశువులు కరెంట్ షాక్‌తో చనిపోయాయి.

News July 31, 2024

3డే లీగ్‌లో ఆకట్టుకున్న పాలమూరు బౌలర్లు

image

HCA 3డే లీగ్ టోర్నీ రెండో మ్యాచ్లో ఉమ్మడి జిల్లా జట్టు బౌలర్లు ప్రతిభ కనబరచడంతో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి M.రాజశేఖర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. మంగళవారం ఘట్కేసర్‌లోని త్యాగి మైదానంలో HYDబ్లూస్ క్లబ్ జట్టు తొలి రోజు 20.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసిందని, జిల్లా జట్టు నుంచి అరుణ్ 10 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు, జయసింహా, గణేశ్ చెరో వికెట్ తీశారన్నారు.

News July 31, 2024

MBNR: జిల్లాల వారీగా 2వ విడత రుణమాఫీ!

image

1.మహబూబ్ నగర్:22,253 మంది రైతులకు గాను..219 కోట్లు 2.నాగర్ కర్నూల్:32,406 మంది రైతులకు గాను..312 కోట్లు 3.గద్వాల్:16,489 మంది రైతులకు గాను..166 కోట్లు 4.వనపర్తి:15,085 మంది రైతులకు గాను..140 కోట్లు 5.నారాయణపేట:17,880 మంది రైతులకు గాను..186 కోట్ల రుణమాఫీ అయ్యింది. రెండు విడతలు కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,85,067 మంది రైతులకు రూ.2,095.22 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు తెలిపారు.

News July 30, 2024

రవీంద్ర భారతిలో చిన్నారెడ్డికి సన్మానం

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో సినారే, దాశరధి జయంతి వేడుకలను తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సిల్వర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల కమిటీ సభ్యులు చిన్నారెడ్డిని తలపాగా శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్వాహకులు, ప్రముఖులు, సాహిత్య, కళాభిమానులు పాల్గొన్నారు.

News July 30, 2024

గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు: ఓబేదుల్లా కొత్వాల్

image

గత బీఆర్ఎస్ పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాల పాటు కేవలం హంగు, ఆర్భాటాలకు పోయారు తప్ప చేసింది మీ లేదని విమర్శించారు.

News July 30, 2024

శ్రీశైలం 7గేట్లు ఎత్తి నీటి విడుదల

image

ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 4.02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. జూరాల జలాశయం 39 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 2,84,597 క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ జల సవ్వడి చూసేందుకు భారీగా సందర్శకులు వస్తున్నారు.

News July 30, 2024

ఉద్యోగం కోల్పోయి.. అతిథి ఉపాధ్యాయుల అవస్థలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గురుకులాల్లో కొంతకాలంగా కొందరు అతిథి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇటీవలే నూతన గురుకులాల నియామకాలు జరగడంతో సుమారు 300 మంది పైగా అతిథి అధ్యాపకులు జాబా కోల్పోయి వీధిన పడ్డారు. అకాడమిక్ సంవత్సరం గడిచిన 2 నెలల తర్వాత నియామకాలు చేపట్టడంతో ప్రైవేటు, ఇతర విద్యాసంస్థల్లో అవకాశం దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరారు.