Mahbubnagar

News July 30, 2024

MBNR:శుభకార్యాలకు అద్దె బస్సులు.. సంప్రదించండి!

image

వచ్చే నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం ఆరంభమవుతున్నందున పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. MBNR-94411 62588, GDWL-99592 26290, NGKL-83092 14790, SDNR-91826 45281, అచ్చంపేట-99592 26291, కల్వకుర్తి-99123 76847, కొల్లాపూర్-90004 05878, నారాయణపేట-99592 26293, వనపర్తి-99592 26289 చరవాణి నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

News July 30, 2024

జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతుల వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో <<13735872>>SGTలకు<<>> పదోన్నతులు కల్పించడంతో ఉన్నత పాఠశాలల్లో చాలా వరకు సబ్జెక్టు నిపుణుల కొరత తీరనుంది. పీఎస్ HMతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు,హిందీ,ఆంగ్లం,గణితం,భౌతిక,జీవ, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో అర్హులకు పదోన్నతి కల్పించారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు కూడా వారి అర్హతల ఆధారంగా SAలుగా పదోన్నతి కల్పించారు. MBNR-44,NGKL-55,GDWL-35, NRPT-53,WNPT-62 మంది టీచర్లు పదోన్నతులు పొందారు.

News July 30, 2024

జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతుల వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో <<13735872>>SGTలకు<<>> పదోన్నతులు కల్పించడంతో ఉన్నత పాఠశాలల్లో చాలా వరకు సబ్జెక్టు నిపుణుల కొరత తీరనుంది. పీఎస్ HMతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు,హిందీ,ఆంగ్లం,గణితం,భౌతిక,జీవ, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో అర్హులకు పదోన్నతి కల్పించారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు కూడా వారి అర్హతల ఆధారంగా SAలుగా పదోన్నతి కల్పించారు. MBNR-44,NGKL-55, GDWL-35, NRPT-53,WNPT-62 మంది టీచర్లు పదోన్నతలు పొందారు.

News July 30, 2024

MBNR: 248 మంది SGTలకు పదోన్నతులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మరో 248మంది <<13735934>>SGTలకు <<>>పదోన్నతులు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, ఖాళీల వివరాలను ప్రకటించి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. సోమవారం సాయంత్రం అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 30, 2024

MBNR: నేడే రెండో విడత పంట రుణమాఫీ

image

పంట రుణమాఫీలో భాగంగా రెండో విడత మాఫీ ఈనెల 30న CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, రూ.1.50లక్షలలోగా రుణం ఉంటే మాఫీ అవుతుందని ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వీసీ యూనిట్ ఉన్న రైతు వేదికల్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. HYDలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, MPలు, MLCలు, MLAలు తదితరులు హాజరవుతారని, మ.12గం.కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

News July 30, 2024

NGKL: ఓపెన్ స్కూల్స్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణా సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్స్‌ (టాస్) ద్వారా ఓపెన్ 10వ తరగతి, ఓపెన్ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం 10వ తరగతిలో చేరే విద్యార్థులు 14 సంవత్సరాలు నిండిన వారై ఉండాలని సూచించారు.

News July 29, 2024

ఉమ్మడి జిల్లా నేటి టాప్ న్యూస్

image

✓ శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓ జూరాల 46 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓రేపు రెండో విడత రుణమాఫీ: నాగర్ కర్నూల్ కలెక్టర్.
✓ ఉమ్మడి జిల్లాలో ముగిసిన కౌడి పీర్ల ఉత్సవాలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సినారే జయంతి వేడుకలు.
✓ అచ్చంపేట: ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం.
✓ రాజోలి: సుంకేసులకు పోటెత్తిన వరద.
✓ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై సీఎంతో రైల్వే శాఖ అధికారుల చర్చలు.

News July 29, 2024

శుభకార్యాలకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి: RM

image

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆర్టీసీ ఉత్తమ సేవలు అందిస్తుందని MBNR జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. బస్సులు అద్దెకు అందుబాటులో ఉన్నాయని ఆగస్టు 5వ తేదీ తర్వాత జరిగే శుభకార్యాలకు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కొరకు MBNR-9441162588, WNPT-9959226289, GDWL-9959226290, NRPT-9959226293, NGKL-8309214790 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News July 29, 2024

వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేయడంలో రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. విత్తనాలు కొనేటప్పుడు రసీదు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.

News July 29, 2024

పెబ్బేరు: 4 నెలల గర్భిణి మృతి.. కేసు నమోదు

image

కడుపు నొప్పితో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన 4 నెలల గర్భిణి మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో జరిగింది. కుటుంబ సభ్యులు, SI వెంకటేశ్వర్లు వివరాలు.. శ్రీరంగాపూర్(మం) నాగసానిపల్లికి చెందిన పుష్పలత(22) శనివారం కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కర్నూలు సిఫార్సు చేయగా అప్పటికే మృతి చెందినట్లు కర్నూలు వైద్యులు తెలిపారు.