India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేసు డీల్ చేస్తానని లంచం తీసుకున్న కానిస్టేబుల్ వినోద్ రెడ్డిపై SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. బిజినపల్లి(M) గంగారం గ్రామానికి చెందిన సురేష్ ప్రేమ వివాహం చేసుకొని స్వగ్రామానికి రాగా యువతి కుటుంబీకులు అతడిపై దాడిచేసి యువతిని తీసుకువెళ్లారు. సురేష్ 100కు ఫోన్ చేయగా వినోద్ రెడ్డి గ్రామానికి వెళ్లి మీ కేస్ డీల్ చేస్తానని రూ.2 వేలు తీసుకున్నాడు. దీంతో వినోద్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అక్టోబర్ 9వ తేదీన కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాష జోగులాంబ దేవికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఇఓ పురేందర్ కుమార్ తెలిపారు. చాలాకాలంగా ఏపీ ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని స్పష్టం చేశారు.
అచ్చంపేట మండలం నడింపల్లిలో గణనాథుడి లడ్డూను ముస్లిం సోదరుడైన ఎండీ. మోదీన్ కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 21 రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను శనివారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో రూ.40,116కు మోదీన్ సొంతం చేసుకున్నాడని తెలిపారు. అతని కుటుంబానికి ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని, వినాయకుడి కృపతో అష్ట ఐశ్వర్యాలు, సుఖఃసంతోషాలు కలగాలని కమిటీ తరఫున కోరుకోవడం జరిగిందన్నారు.
ప్రతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్టోబర్ 7లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం వచ్చి 10నెలలైనా 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఇదే తరహాలో 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
DEECET 2024లో ర్యాంకు పొందిన అభ్యర్థులు రెండేళ్ల DIEEd కోర్సులో అడ్మిషన్ పొందడానికి, ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చూసుకోని విద్యార్థులు వెంటనే వెరిఫికేషన్ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ మహమ్మద్ మేరాజుల్లాఖాన్ తెలిపారు. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ బ్యాచ్ 2024-26 వారికి అక్టోబర్ 1న వెరిఫికేషన్ ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అలంపూర్ తుంగభద్ర నది సమీపంలో తొమ్మిదవ శతాబ్దం కాలంనాటి పురాతన ఆలయం మీసాల యోగ నరసింహ స్వామి దేవాలయం. ఈ ఆలయంలోని నరసింహస్వామి మీసాలు ఉండి యోగ ముద్రలో దర్శనమిస్తున్నారు. కళ్యాణి చాణిక్య రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు 16 శతాబ్దంలో అభివృద్ధి చేశారు. మండపంలో పురాతనమైన గంట, పద్మనాభ స్వామి విగ్రహం, ఆలువార్లు శిలా విగ్రహాలు చూడదగ్గవి. ఆలయం ఎదురుగా దండ ఆంజనేయస్వామి, రాతి ధ్వజస్తంభం ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు కల్లూరుతిమన్ దొడ్డిలో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 32.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 29.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగులలో 29.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విదేశాలలో పాలమూరు మామిడి పండ్లు విక్రయించడానికి అనుమతులు వచ్చాయి. ఎగుమతులు చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ నర్సయ్య వెల్లడించారు. దేశంలో మన మామిడి పండ్లను మంచి గుర్తింపు ఉందని, శాస్త్రవేత్తలు సూచించిన విధానాలను పాటిస్తూ.. మామిడి రైతులు నాణ్యత ప్రమాణాలు ఎగుమతి పెంచాలని సూచించారు.
జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో శుక్రవారం 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు సురేశ్, సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 196 మెగావాట్లు, 201.187 ఎం.యూ, దిగువలో 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 174.750 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 32,475 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి 360.108 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించారు.
Sorry, no posts matched your criteria.