India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘పాలమూరోళ్లం మేము.. KCRకు ఏం అన్యాయం చేశాం.. 2009లో కరీంనగర్‌లో KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొస్తే.. వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు.. భుజాల మీద మోసి పార్లమెంట్‌కు పంపించారు. తెలంగాణ వచ్చాక సీఎం అయి కూడా పాలమూరుకు KCR ఏం చేయలేదని ఆరోపించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి వాళ్లను జైలుకు పంపిస్తామని NGKL జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ నెంబర్ ప్లేట్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన 200మందికి అవగాహన కల్పించి, ట్రాఫిక్ రూల్స్ వివరించారు. రోడ్డు ప్రమాదాలు నిలువరించడానికి ట్రాఫిక్ పోలీస్ వింగ్ ప్రారంభించామన్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగుతోంది. ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులకు చేరింది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.
బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఐ చంద్రశేఖర్ వివరాలు ప్రకారం.. భూత్పూర్ మండలంలోని శేరిపల్లి(హెచ్)కి చెందిన సాయితేజ(21) బైక్‌పై భూత్పూర్ చౌరస్తా నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇంటర్నల్ రోడ్డుపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. 865 అడుగుల మేర వరద జలాల ప్రవాహం ఉండటంతో సప్తనదుల ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునుగుతుందని పురోహితులు రఘురామ శర్మ చెప్పారు. సంగమేశ్వర క్షేత్రంతో పాటు సోమశిల, జటప్రోల్‌లో పురాతన దర్గాలు, సురభిరాజుల కట్టడాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని తీర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.
జూరాల జలాశయంలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి 2.65 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 36 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 20 వేలు కలిపి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 6.554 టీఎంసీల మేర ఉంది. ఆల్మట్టి జలాశయానికి 2.75 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుందని జూరాల అధికారులు వివరించారు.
గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ 2 గేట్లు శుక్రవారం సాయంత్రం ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 292 మీటర్లు ఉండగా ప్రస్తుతం 289.70 మీటర్లుగా ఉంది. రెండు గేట్ల ద్వారా 7286 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1.540 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రేపటికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.
షాద్‌నగర్ ట్రాన్స్ కో డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్ 2 ఉద్యోగి ఆర్టిజన్ ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల యూనిట్‌లో పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుని వాటిని శాఖకు చెల్లించకపోవడం, నిధులు దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ZPTCలు, MPTCలు, సర్పంచులుగా పనిచేసిన వారికి గౌరవ వేతనాలు కొన్ని నెలల పాటు అందలేదు. గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో ఇటీవలనే పదవీ విరమణ చేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉపశమనం కలగనుంది. గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసినప్పటికీ వారికి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఆ నిధులు కేటాయించడంతో వారికి ఊరట లభించింది.
ఆర్టీసీ అభ్యున్నతి కోసం ఉద్యోగులు కృషి చేయాలని TGSRTC హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ విజయం పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ ప్రగతి పురస్కారాలు అందజేశారు. రీజియన్ పరిధిలోని దాదాపు 50 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి, డీఎం సుజాత పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.