India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వివరాలు ఇలా(కోట్లలో).. ✒పాలమూరు-రంగారెడ్డి:రూ.1,285 ✒కల్వకుర్తి: రూ.715 ✒జూరాల-పాకాల కాలువ: రూ.0.15 ✒భీమా జూరాల-పాకాల: రూ.32 ✒జూరాల రాజీవ్:రూ.8 ✒నెట్టెంపాడు: రూ.105 ✒ఆర్డీఎస్: రూ.29.50 ✒సంగంబండ: రూ.188.07 ✒కోయిలసాగర్: రూ.429.86 కోట్లు కేటాయించారు.
పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన కౌశిక్(21) బీఎస్సీ చదువుతున్నాడు. మొదటి సం.లో ఫెయిల్ కావడంతో మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మహబూబ్ నగర్లో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ రాత పరీక్షకు 665 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష లకు 728 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 63 మంది హాజరుకాలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలకు రూ.6.50 కోట్లను కేటాయించారు. పరిశోధన- అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల చొప్పున్న రూ. 603.76 కోట్లు ప్రతిపాదించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో.. రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం అధికారులు గురువారం ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కానప్పటికీ, రెండు గేట్ల ద్వారా దిగువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లుగా జేఈ రాజు తెలిపారు. డ్యాం మొత్తం నీటిమట్టం 292.00 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 290.90 మీటర్లుగా నమోదైనట్లుగా ఆయన పేర్కొన్నారు.
మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న బాలరాజు ఏసీబీకి చిక్కాడు. గురువారం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మక్తల్‌కు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం అడిగాడు. దీంతో శ్రవణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నేడు సర్వేయర్ రూ.9వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా గురుకుల సెంటర్లల్లో ఈనెల 26న బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024 మార్చిలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
SHARE IT..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు వర్షపాతం తగ్గుతూ వస్తోంది. గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా మొహ్మదాబాద్ లో 5.0 మి.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 2.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండలో 2.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 317 జీవోపై అప్పీల్ చేసుకున్న ఉపాధ్యాయులు నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. NGKL566 మంది, నారాయణపేటలో 319, వనపర్తిలో 220, గద్వాలలో 179, మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువగా 118 మంది ఉపాధ్యాయులు అప్పీల్ చేసుకున్నారు. ప్రభుత్వం వారి అభ్యర్ధనను ఆమోదిస్తే సొంత జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశముంది. ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.