Mahbubnagar

News May 25, 2024

వనపర్తి: బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

image

వనపర్తి జిల్లాలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం.. ఇద్దరు బైక్‌పై గొల్లపల్లి నుంచి ఆదిరాల వెళ్తుండగా ఏదుల గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

MBNR: పంట రుణాలపై సీఐడీ విచారణ !

image

రైతులు DCCB అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-19 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై CID అధికారులు విచారణ చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు DCCB నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను ఆడిట్ చేసే క్రమంలో చెల్లింపుల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు.

News May 25, 2024

MBNR: భూముల విలువ పెంపునకు కసరత్తు !

image

భూముల మార్కెట్ విలువలు సవరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఖజానాకు ఏటా రూ.250 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం 2సార్లు భూముల విలువలు పెంచింది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో గజం కనిష్టంగా రూ.1000లకు గరిష్టంగా రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో కనిష్టంగా రూ.10వేల, గరిష్టంగా రూ.20 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధిక వర్షపాతం గద్వాల జిల్లా కేంద్రంలో 48.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 46.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగులలో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 19.5 మి.మీ నారాయణపేట జిల్లా నర్వలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News May 25, 2024

MBNR: అనుమానాస్పద స్థితిలో.. యువకుడి మృతి

image

అనుమానాదస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన MBNR పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ స్వామి వివరాల ప్రకారం.. పాన్ సాబ్ గుట్ట ప్రాంతానికి చెందిన సందీప్ రెడ్డి (27) ఈనెల 23న సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మిత్రుడు గణేశ్ ఇంటికి వెళ్ళాడు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. గొంతుకు ఉరితీసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, క్లూజ్ టీంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.

News May 25, 2024

ఉమ్మడి జిల్లాలో ZPTC, MPTC, సర్పంచుల స్థానాలు ఇలా

image

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా.. అనంతరం అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టనున్నారు.
✒MBNR: ZPTCలు-14, MPTCలు-184, సర్పంచులు-441 ✒NGKL: ZPTCలు-20, MPTCలు-212, సర్పంచులు-461
✒GDWL:ZPTCలు-12, MPTCలు-141, సర్పంచులు-255
✒WNPT:ZPTCలు-14, MPTCలు-128, సర్పంచులు-225
✒NRPT:ZPTCలు-11, MPTCలు-142, సర్పంచులు-280 స్థానాలు ఉన్నాయి.

News May 25, 2024

మహబూబ్‌నగర్: విద్యా వాలంటీర్ల ఊసేది..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,176 ప్రభుత్వ పాఠశాలలుండగా, 3.01లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 15,453 ఉపాధ్యాయ పోస్టులకు 1,967 ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయుడు ఉన్నచోట పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,538 మందికి పైగా విద్యా వాలంటీర్లను నియమించారు. 20రోజుల్లో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు విద్యా వాలంటీర్ల ఊసే లేదని నిరుద్యోగులు తెలిపారు.

News May 24, 2024

గోపాల్‌పేట: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ వ్యవహారంలో పెద్దలు మందలించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన గోపాల్‌పేట మండలం కేశంపేటలో శుక్రవారం జరిగింది. SI తిరుపతిరెడ్డి వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్(24) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియడంతో ఇంట్లో మందలించారు. దీంతో మల్లేశ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 24, 2024

అరవింద్ మృతదేహాన్ని రప్పించేందుకు DK అరుణ చర్యలు

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అనుమానాస్పదంగా మృతి చెందిన షాదీనగర్ కు చెందిన అరవింద్ యాదవ్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీకే అరుణ తెలిపారు. శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరుపగా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారని అరుణ తెలిపారు.

News May 24, 2024

MBNR: దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.