India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని కొండ ప్రణవి ప్రతిభ చూపించారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండి చేయి చూపింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించారు. జాతీయ హోదా సంగతి అటుంచితే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు ఇవ్వడం లేదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం పాలమూరుకు మాత్రం ఏమాత్రం కేటాయించలేదు.
కొల్లాపూర్ తీరానికి సమీపంలోని సోమశిలలో సప్త నదుల ప్రాంతం శ్రీ సంగమేశ్వర క్షేత్రం చుట్టూ కృష్ణా నది వరదతో ఆలయంలోని వేపదారు శివలింగం నీట మునిగింది. జటప్రోల్లో పురాతన దర్గా, సురభి రాజుల భవనం చుట్టూ వరదలాలు ప్రవహించాయి. మత్స్యకారులు తీరం వెంబడి ఏర్పరచుకున్న తాత్కాలిక నివాసాలను ఎగువ ప్రాంతానికి తరలించారు. పుష్కర ఘాట్లకు వరద వచ్చి చేరింది. 842 అడుగులకు పైగా వరద జలాలు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నాయి.
దేవాదయ శాఖలో 20 ఏళ్ల తర్వాత బదిలీలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1340 దేవాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందుతున్నవారు 236 మంది ఉన్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలను రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈనెల 29 వరకు బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా సిరిసినగండ్లలో 13.5 మి.మీ, నారాయణపేట జిల్లా బిజ్వార్‌లో 8.8 మి.మీ వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఇటీవలే వెలువడిన సెమిస్టర్-6 ఫలితాలు వెలువడ్డాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని PU పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెమిస్టర్-6 చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతే ఒక సంవత్సరం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేటలో ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న పాఠశాలలో షీటీం ఇన్ ఛార్జ్ పద్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన ఫోన్‌లో నీలిచిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీం దృష్టికి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.
శ్రీశైలం జలాశయంలో మంగళవారం 842.4 అడుగుల నీటిమట్టం, 65.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జూరాల గేట్లు ఎత్తి 1,22,357 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 29,433 మొత్తం 1,51,790 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో రేగుమాన్ గడ్డ నుంచి ఎంజీకేఎస్ఐకు 977క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. భూగర్భ కేంద్రంలో 2.346 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు.
కల్కి సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ MBNR జిల్లా కేంద్రంలోని ఏవీడీ సినిమాస్ (థియేటర్)కు మంగళవారం రావడంతో ఆయన్ను చూస్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులను ఉద్దేశించి నాగ్ మాట్లాడుతూ.. మన జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, తమ ఫ్యామిలీ అందరూ ఇక్కడి వారే కావడం, కల్కి సినిమా ఇక్కడ పెద్దగా ఆడడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అభిమానులకు, ఉమ్మడి జిల్లా సినిమా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రధానంగా ఈసారి బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం పాలమూరు ప్రజల్ని నిరాశకు గురిచేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై, కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వేలైన్ల నిర్మాణంపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.