India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిన్నచింటకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకి సేవ కొనసాగింది. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ళ గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి.

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అలంకరణ మహోత్సవం జరగనుంది. అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్థుల ఇలవేల్పు కురుమూర్తి స్వామికి 15వ శతాబ్దంలో స్వామివారికి రాజా సోమ భూపాల్ బంగారు ఆభరణాలు చేయించారు. ఏటా జరిగే అలంకరణ ఉత్సవంలో వీటిని స్వామి వారికి అలంకరిస్తారు.1976 నుంచిఆత్మకూరు SBIలో నగలు భద్రపరుస్తున్నారు. రేపు భారీ ఊరేగింపుగా పోలీసు బందోబస్తు ఆభరణాలు కురుమూర్తికి తీసుకొస్తారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఎలాంటి ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే సోమశిల నుంచి శ్రీశైలానికి బోటు ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుంగభద్ర నదిలో జోగులాంబ పుష్కర ఘాట్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వెళ్లేందుకు టూరిజం శాఖ ప్రతిపాదన చేస్తున్నట్లు అల్లంపూర్ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నదిలో వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. కాగా బోటు ప్రయాణంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు ఉన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల జీతాలు విడుదల అయ్యాయని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఖజానాకు బిల్లులు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వీరికి నెలకు రూ.54,220 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనన్నారు.

MBNR:ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

సంక్రాంతి నాటికి గ్రామ పంచాయతీలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనతో గ్రామీణాల్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంచారు. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి.

జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MBNR కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి ఇండ్ల జాబితా, యజమాని, చిరునామా వివరాలు సేకరించి ఇంటికి సర్వే స్టిక్కర్ అతికిస్తామన్నారు. సర్వే నిర్వహించేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందికి ఆధార్, రేషన్, కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు తదితర సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

✔MBNR: పెట్టుబడులే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల MLAల విదేశీ పర్యటన ✔ సౌత్ జోన్ ఎంపికలు వాయిదా✔వనపర్తిలో సినీనటి అనసూయ సందడి✔పెండింగ్ బిల్లులపై.. మాజీ సర్పంచ్లు అరెస్టులు✔ప్రారంభమైన పత్తి,వరి కొనుగోలు కేంద్రాలు✔గండీడ్:రేపు 38 గ్రామాల్లో తాగు నీళ్లు బంద్✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు మీ సేవలు బంద్✔పలుచోట్ల కార్తిక శోభ.. ఆలయాల్లో భక్తుల సందడి

రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి వాహనదారుల మృతికి కారకులు కావద్దని MBNR ఎస్పీ జానకి సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి నల్లని కవర్లు కప్పడంతో రాత్రివేళలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని పేర్కొన్నారు. కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బావుల వద్దనే ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.