Mahbubnagar

News October 8, 2024

MBNR: ‘పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి’

image

చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని చెబుతున్నారు.

News October 8, 2024

మరికల్: రూ.11,11,111 నోట్లతో దుర్గామాత అలంకరణ

image

మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని రూ. 11,11,111 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.

News October 8, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలిలా…

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి లో 35.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 32.7 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోటకొండ లో 31.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొల్లూరులో 30.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 29.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 8, 2024

MBNR: గణనీయంగా పెరిగిన BSNL.. త్వరలో 4G టవర్స్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. గత 3 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

News October 8, 2024

వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు (మంగళ,బుధవారాల్లో) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా అధికారులు సూచించారు.

News October 8, 2024

నాగర్‌కర్నూల్: విషాదం.. కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. లింగాలకు చెందిన అశోక్, శిరీష దంపతుల కొడుకు అభిరామ్(11 నెలలు). సోమవారం సాయంత్రం బాబు ఆడుకుంటుండగా ఇంట్లో ఉన్న బెడ్ లైట్ వైర్ తగిలి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే లింగాల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.

News October 7, 2024

గద్వాల: నవజాత శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూరు నాగరాణికి పురిటి నొప్పులు రాగా గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం అడ్మిట్ చేశారు. కాన్పు చేసే సమయంలో నవజాత శిశువు కడుపులో మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని నాగరాణి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News October 7, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా విలియంకొండలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 34.5 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 33.1 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 31.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 7, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

News October 7, 2024

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

image

శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతుంది. జూరాల గేట్ల ద్వారా 21,603, విద్యుదుత్పత్తి చేస్తూ 37,252, సుంకేసుల నుంచి 26,874 మొత్తం 85,756 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తుంది. దీంతో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, AP జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ14,379 మొత్తం 49,694 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.