Mahbubnagar

News July 22, 2024

శ్రీశైలం ప్రాజెక్టు UPDATE

image

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 1,14,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 822.5 అడుగుల వద్ద 42.7386 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో స్థానికంగా 2.80 మి.మీ.,ల వర్షపాతం నమోదైంది. అలాగే జలాశయంలో 63 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.

News July 22, 2024

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు హాజ‌రైన మంత్రి

image

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ క‌మిటీ 46వ సెష‌న్ లో ఆదివారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు. మన రాష్ట్రానికి ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధికి చర్య‌లు తీసుకోవ‌డానికి ఇలాంటి స‌మావేశాలు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

News July 21, 2024

NGKL: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ <<13676667>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా.. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

News July 21, 2024

MBNR: మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

image

బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, పాడి పంటలు, వ్యాపారాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు మహబూబ్ నగర్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

News July 21, 2024

MBNR: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు

image

ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. తద్వారా జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 87,082 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 820 అడుగులకు చేరుకుంది.

News July 21, 2024

NGKL: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

News July 21, 2024

MBNR: జూరాలలో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో జూరాల వద్ద పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83వేల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

News July 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లిలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మొహ్మదాబాద్ 22.8 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా మదనాపురంలో 21.5 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 21, 2024

MBNR: ఆపిల్ ఫోన్‌ కోసం హత్యాయత్నం

image

ఆపిల్ ఫోన్ దక్కించుకునేందుకు ఓవ్యక్తి ఏకంగా హత్య చేయబోయిన ఘటన MBNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. వీరన్నపేటకు చెందిన సయ్యద్‌మస్తాన్, టీడీగుట్ట ఫైర్‌స్టేషన్‌కు చెందిన అక్తర్ ఫ్రెండ్స్. ఈనెల 12న అక్తర్ ఫోన్‌ను ముస్తాన్ తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఫోన్ తీసుకునేందుకు ముస్తాన్ ఇంటికెళ్లగా కత్తితో పొడిచాడు. అక్తర్‌ను ముళ్లపొదల్లో వేయడానికి బైక్‌పై తీసుకెళ్లి భయంతో క్లాక్ టవర్ వద్ద వదిలి పరారయ్యాడు.

News July 21, 2024

MBNR: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తులు

image

బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష 18, జనవరి, 2025న నిర్వహిస్తామని తెలిపారు.