India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న ఆన్ లైన్ డీఎస్సీ పరీక్షలకు శనివారం 475 మందికి గాను 405 మంది హాజరైనట్లు డీఈఓ రవీందర్ తెలిపారు. ఉదయం మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
రైతుబీమా కోసం 2024 జున్ 28 నాటికి రిజిస్ట్రేషన్ అయిన వారి జాబితా ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయశాఖకు అందిందిన DAO వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18-59 సం.లు ఉన్న వారు ఆగస్టు 4లోపు క్లస్టర్ వ్యకసాయ విస్తరణ అధికారిని కలిసి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతుబీమా దరఖాస్తు ఫారానికి పట్టా పాస్‌బుక్, ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ కాపీలతో రైతులు AEDOను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఒంటరి వృద్ధులు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వరుస దొంగతనాలు చేసే ముఠాను పట్టుకున్నట్లు రూరల్ CI గాంధీనాయక్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. MBNR పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ హుస్సేన్, ఉమ ఒంటరిగా వృద్ధులు, వృద్ధ మహిళలు కనబడగానే ఆటో ఎక్కించుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపుతామని బెదిరించి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బు లాక్కుంటారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేతాన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలిపారు. జిల్లాలో వర్షాల దాటికి వాగులు ప్రవహిస్తున్న దృష్ట్యా ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏమైనా అపాయం పొంచి ఉన్నా, ప్రమాదాలు జరిగిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.
వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలలో రైతులను మోసం చేసి రూ.100 కోట్లకు పైగా డబ్బులను వసూలు చేసిన దొంగ బాబాపై చర్యలు తీసుకోవాలని బాధితులు శుక్రవారం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రెండు జిల్లాల పరిధిలోని 1,426 మంది రైతుల నుంచి బాబా భారీగా డబ్బులు వసూలు చేశాడన్నారు. డబ్బులు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశారన్నారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు.
ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన NGKL జిల్లా అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. బల్మూర్ మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ పనికి వచ్చారు. బండల వ్యాపారం నిర్వహించే వినోద్ సింగ్, గజానంద్ అనే వ్యక్తులు ఇద్దరు మహిళలను కూలీ పనికి తీసుకెళ్లారు. వారిని కారులో ఎక్కించుకొని మద్యం తాగించి అత్యాచారం చేశారు. కేసు నమోదైంది.
నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో ఈ నెల 17న మొహరం పండుగకు వచ్చిన బాలిక భాను(8)తప్పిపోయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బాలికకు దూరంగా ఉన్న తల్లి అంజమ్మ కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు తీసుకువెళ్లింది. తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి బాలికను తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారం లేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వీపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కింది స్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.
Sorry, no posts matched your criteria.