India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖిల్లాఘనపురం మండలంలోని మామిడిమాడ సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మన్ పరమేశ్వర్ తృటిలో చిరుతదాడి నుంచి తప్పించుకున్నాడు. గురువారం విధుల్లో భాగంగా జంమాయపల్లి నుంచి మామిడిమాడ తండాకు వస్తుండగా మార్గమధ్యలో చిరుత ఆయన దగ్గరకు వస్తూ కనిపించింది. ఒక్కసారిగా తన బైక్ వేగం పెంచి పులి నుంచి తప్పించుకొని తండాకు వచ్చాడు. ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకుని తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఓ యువకుడు పీరు మోస్తూ.. కుప్పకూలిన ఘటన వనపర్తి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సవాయిగూడెం గ్రామానికి చెందిన గువ్వల మధుసుదన్(29) గురువారం పీరు ఎత్తుకొని గ్రామంలో ఊరేగిస్తుండగా గుండెనొప్పికి గురయ్యాడు. స్థానికులు వనపర్తి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మధుసుదన్‌కు భార్యా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పుట్టుకతో దివ్యాంగురాలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలను మాత్రమే అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ పాతిమా విద్యాలయం, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు నిర్వహించిన పరీక్ష కేంద్రాలకు 647 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 81 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ప్రతి రోజు 728 మంది అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండూ పూటలు పరీక్షలు నిర్వహించనున్నారు.
HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు సాయి సత్య క్రికెట్ క్లబ్(సికింద్రాబాద్) జట్టుపై 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు అభినందించారు. 64 పరుగులు చేసిన షాదాబ్‌కు సంఘం కోశాధికారి ఉదేశ్ కుమార్ రూ.20వేలు విలువ చేసే బ్యాట్‌ను ప్రదానం చేశారు. ♥CONGRATULATIONS
తొలి విడతలో రూ.లక్షలోపు పంట రుణాలమాఫీకి సంబంధించి ఉమ్మడి MBNRజిల్లాలో 1,91,519 కుటుంబాల్లో 2,01,102 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.1,120.74 కోట్ల మాఫీకాగా.. అత్యధికంగా రుణమాఫీ అయిన నియోజకవర్గాల్లో కల్వకుర్తి రూ.103.02కోట్లతో రాష్ట్రంలో 3వస్థానంలో ఉండగా.. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. రూ.99.84కోట్లతో కొడంగల్, రూ.92.44కోట్లతో అచ్చంపేట నియోజకవర్గాలు వరుసగా 2,3 స్థానాలు దక్కించుకున్నాయి.
సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.
గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 1500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.140 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో గురువారం సమావేశంలో సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. దీంతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మద్యం మత్తులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. లింగసానిపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. క్షణికావేశంలో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేయడానికి రూ.7 వేల కోట్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గం కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ పొందే రైతులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.