Mahbubnagar

News July 18, 2024

పెబ్బేరు: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్

image

పెబ్బేరు పట్టణంలోని చెలిమిల్లలో ఈనెల 13న నాగరాల నర్సింహ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుడి కుమారుడు శివకుమార్, అతని భార్య సుహాసిని, తల్లి గోవిందమ్మలు కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు ఎస్సై చెప్పారు. నర్సింహ మద్యానికి బానిసై తమకు ఉన్న పొలాన్ని అమ్ముతాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు.

News July 18, 2024

MBNR: శ్రీధర్ రెడ్డి హత్య ప్రదేశాన్ని పరిశీలించిన ఐజీ

image

చిన్నంబావి మండలంలోని లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్ రెడ్డి (52) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐజీ వి.సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ గిరిధర్ రావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించి స్థానికులు, కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు. సీఎం, డీజీపీ ఆదేశాల మేరకు కేసు విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 18, 2024

MBNR: డీఎస్సీ అభ్యర్థులకు దారులు తెలుపుతున్న ట్రాఫిక్ సిబ్బంది

image

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో MBNR జిల్లా పోలీసులు వినూత్నంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి దారులు తెలుపుతున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న కూడలిలో ట్రాఫిక్ సిబ్బంది కార్డు పట్టుకొని సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో ఫాతిమా విద్యాలయం క్రిస్టియన్ పల్లి, జేపీఎంసీ ధర్మపురం సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News July 18, 2024

MBNR: సొంత ఊరు రైతులతో సీఎం ముఖాముఖి

image

సొంత గ్రామం కొండారెడ్డిపల్లి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి అవుతారని వంగూరు మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.7వేల కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా సా.4 గంటలకు సొంత గ్రామం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కానున్నారు. రైతులతో మాట్లాడి తెలుసుకోనున్నారు.

News July 18, 2024

MBNR: నేటి నుండి డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు

image

MBNR జిల్లాలో ఈనెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించే DSCకి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలో ఫాతిమా విద్యాలయం, ధర్మాపూర్ వద్ద ఉన్న జేపీఎన్సీఈలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, కేంద్రాల్లో ప్రవేశానికి రోజూ 2 సెషన్లలో ఉ.7.30 గంటల నుంచి 8.50 గంటల వరకు, మ.12.30 నుంచి 1.50 గంటల వరకు అభ్యర్థులకు అనుమతి ఇస్తామన్నారు.
>>ALL THE BEST

News July 18, 2024

MBNR: కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహాలు: జూపల్లి

image

రాబోయే రోజులలో తెలంగాణలోని అన్ని రకాల కళాకారులకు ప్రోత్సాహాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYDలోని రవీంద్రభారతిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజా రెడ్డి ప్రదర్శించిన కాకతీయ 3వ భాగం నృత్య రూపక కార్యక్రమానికి జూపల్లి హాజరై మాట్లాడారు. CM రేవంత్ రెడ్డి సారుద్యంలో కలలు సాంస్కృతి సాహిత్యంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

News July 17, 2024

MBNR: రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కోసం మొదటి విడత లిస్టు అధికారులు విడుదల చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యూవల్ అయిన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయిలున్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేయగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు వేదికలో సంబరాలు చేసుకోవడానికి పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నారు.

News July 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 14.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 10.8 మి.మీ, గద్వాల జిల్లా గట్టులో 3.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా తుడుకుర్తిలో 0.5 మి.మీ, వనపర్తి జిల్లా రేమోద్దులలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 17, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు

image

డీఎస్సీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఇఓ రవీందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్లోని ఫాతిమా విద్యాలయం క్రిస్టియన్ పల్లి, JPNCE ధర్మాపూర్‌లో ఆన్‌లైన్ బేస్డ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష 13 రోజులో రోజుకు 2 సెక్షన్లు జరుగుతుందని, ఉ.9 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ వెంట తీసుకురావాలన్నారు.

News July 17, 2024

గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వ సాకారం: మంత్రి జూప‌ల్లి

image

క‌డ్తాల్ మండ‌లం హ‌న్మాస్ ప‌ల్లి గ్రామం, జ‌మ‌ల‌బోయి తండాలో గిరిజ‌న కార్పోరేష‌న్, ట్రైకార్ ఆద్వ‌ర్యంలో 25 మంది గిరిజ‌నుల‌కు బోర్ మోట‌ర్ పంపు సెట్ల‌ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న గిరిజ‌న రైతుల‌ను ఆదుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అన్నారు.