Mahbubnagar

News July 17, 2024

జడ్చర్ల: బస్సులో రూ.36 లక్షలు చోరీ

image

బస్సులో రూ.36 లక్షలు చోరీకి గురైన ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. HYD మోతీనగర్‌కు చెందిన దామోదర్ విద్యుత్ శాఖ ఉద్యోగి. కర్నూలులో ఉంటున్న తన అక్క భాగ్యలక్ష్మికి డబ్బులు అవసరం ఉండగా ఇచ్చేందుకు మంగళవారం ఉదయం బస్సు వెళ్తున్నాడు. జడ్చర్ల వద్ద టిఫిన్ కోసం దిగుతూ చూడగా సీటుపైన పెట్టిన బ్యాగులో రూ.36లక్షలు కనిపించలేదు. దామోదర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 17, 2024

ఊట్కూర్: పాముకాటుతో యువకుడి మృతి

image

ఊట్కూరు మండలం పులిమామిడికి చెందిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బి. హనుమంతు చిన్న కొడుకు శివ(20) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతతో వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు NRPTఆసుపత్రికి తరలించగా పాము కాటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి MBNR ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెంచాడు

News July 17, 2024

నేడు వనపర్తికి బేబీ సినిమా హీరోయిన్

image

నేడు వనపర్తి జిల్లా కేంద్రానికి బేబీ సినిమా హీరోయిన్ కుమారి వైష్ణవి చైతన్య రానున్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్, జువెలరీ మాల్‌ను వైష్ణవి ప్రారంభించనున్నారు. స్థానిక కొత్తకోట రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయనున్నారు.

News July 17, 2024

ఆర్థిక భారంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నెలకు ఒకసారి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలు ఏర్పాటు చేసేవారు. 2022 నుంచి ఈ శిబిరాలు నిర్వహించడం లేదు. జిల్లా కేంద్రాల్లో పీపీ మాత్రం యూనిట్లలో అరకొరగా నిర్వహిస్తున్నారు. దీంతో అవసరమైన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు రూ‌.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారింది.

News July 17, 2024

MBNR: శ్రీధర్ రెడ్డి హత్య.. దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు

image

చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో 2 నెలల క్రితం జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం రేవంత్ కోరారు. నిన్న HYDలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో పోలీసులకు సూచించారు. శ్రీధర్ రెడ్డి కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని జిల్లా అధికారులను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

News July 17, 2024

MBNR: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో రవీందర్ మంగళవారం పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు ఈనెల 18వ తేదీ వరకు గడువును పొడిగించారని చెప్పారు. http:///nationalaward stoteachers.education.gov.in అనే పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 17, 2024

నేడు MBNR, NRPTలో భారీ వర్షాలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం భారీగా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్‌ సరఫరా స్తంభించడం వంటివి జరగవచ్చని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అని వెల్లడించింది.

News July 17, 2024

MBNR: రూ.2లక్షల రుణమాఫీ.. 3.14 లక్షల మంది రూ.లక్ష లోపు వారే

image

 ఉమ్మడి పాలమూరులో రూ.2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5,49,108 మంది రైతులు ఉండగా సుమారు రూ.2,736 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 70 శాతం మందికిపైగా రూ.లక్ష లోపు వారే. ఈనెల 18న లక్ష వరకు నగదు జమయ్యే రైతులు 3.14 లక్షల మంది ఉండొచ్చని అంచనా. అయితే ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో మాఫీ ఎవరెవరికి వర్తిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

News July 17, 2024

MBNR: ‘తప్పుడు వివరాలు సమర్పించోద్దు’

image

ఉమ్మడి జిల్లాలో ఆదాయపు పన్ను రిఫండ్ పొందేందుకు కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ రేంజ్-5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన వారు 14 వేల మంది ఉంటే.. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10,635 మంది ఉన్నారు. తప్పుడు వివరాలు సమర్పించవద్దని, అక్రమ మార్గాలు అనుసరించవద్దని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ సుమిత సూచించారు. కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు ఆదాయపు పన్ను శాఖకు అందుతాయని అన్నారు.

News July 17, 2024

MBNR: జూరాలకు కృష్ణమ్మ పరుగులు

image

ఎగువన కురుస్తోన్న వర్షాలకు జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. అల్మట్టి జలాశయానికి మంగళవారం వరకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద చేరింది. నారాయణ్‌పూర్ జాలాశయంలో 37.64TMCలకు గానూ 28.67TMCల నిల్వ ఉంది. దీంతో జూరాలకు 3వేల క్యూసెక్కులను వదులుతుండగా దాన్ని 60వేల వరకు పెంచే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ అహ్మద్ తెలిపారు. జూరాల సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 7.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.