Mahbubnagar

News May 16, 2024

MBNR: విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం (ఎన్వోఎస్ఎస్)లో భాగంగా ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.చత్రునాయక్ తెలిపారు. పీహెచీ, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే వారు ఇందుకు అర్హులని, ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News May 16, 2024

MBNR: డిగ్రీ దోస్త్ అడ్మిషన్లు షురూ..

image

2024-25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తు దారులు మొదటి దశ వెబ్ఆప్షన్ ఇచ్చేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఆయా డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

News May 16, 2024

నేటి నుంచి పీయూ డిగ్రీ పరీక్షలు

image

PU పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్యూ తదితర కోర్సులు 2,4,5,6వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డా.రాజ్ కుమార్ తెలిపారు. 49 కేంద్రాల్లో 13,751 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల టైంటేబుల్ కోసం www.palamuru- university.com లో సందర్శించాలన్నారు.

News May 16, 2024

నాగర్‌కర్నూల్‌‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

నాగర్‌కర్నూల్‌‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.23 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 62.23 శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో 69.46 శాతం నమోదైంది. ఇక్కడి నుంచి 2019లో పోతుగంటి రాములు(BRS) 1,89,748 భారీ మెజార్టీతో మల్లురవి(INC)పై గెలుపొందారు. కాగా 2024లో మల్లురవి(INC), RS ప్రవీణ్ కుమార్(BRS), పి. భరత్,(BJP), బర్రెలక్క(INDP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

పాలమూరులో అడుగంటిన భూగర్భ జలాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఉమ్మడి జిల్లాలో 18 మండలాల్లో నీటి కొరత ఏర్పడింది. వీటి పరిధిలో 50 శాతానికి పైగా బోరు బావులు ఎండిపోయాయి. మరో 11 మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉంటే ఆ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్టుగా పేర్కొంటారు.

News May 15, 2024

MBNR: జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలకు BRS పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమే అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో నిరసనలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

News May 15, 2024

రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న డిగ్రీ విద్యార్థుల 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాక్ పరీక్షలను ఈనెల 16 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 15, 2024

MBNR: థియేటర్లు బంద్

image

ఉమ్మ‌డి జిల్లాలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సినిమాలు విడుదల లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News May 15, 2024

MBNR: ఫీజు చెల్లింపునకు రేపే చివరి రోజు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశం కల్పించింది. రేపటిలోగా రూ.1000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉంటే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

News May 15, 2024

MBNR, NGKL: లెక్కలేసుకుంటున్న అభ్యర్థులు

image

MBNR, NGKL లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. CM రేవంత్ సొంత  జిల్లా, అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.