Mahbubnagar

News July 16, 2024

జడ్చర్ల: బస్సు దగ్ధం.. కోలుకుంటున్న బాధితులు

image

జడ్చర్ల సమీపంలో NH-44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 15 మంది ప్రయాణికులు కోలుకుంటున్నారు. బస్సులో 36 మంది ఉండగా ఆరుగురు కర్నూలు, నంద్యాల, మరో 30 మంది అనంతపురం, గుత్తి, HYD తదితర ప్రాంతాల వాళ్లు ఉన్నారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం HYDకి తరలించారు. ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు అదనపు డ్రైవర్ కదిరప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

News July 16, 2024

వనపర్తి: కేసీఆర్ కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు

image

BRS అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు వారి సమస్యలు చెప్పుకోవాలంటే ప్రజావాణికి రావచ్చని దానికి అధికారులను కూడా రప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని, రెండు డీఎస్సీలను నిర్వహిస్తామన్నారు.

News July 16, 2024

MBNR: 748 మంది అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు

image

తమ సమస్యల సాధనకై సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు MLA క్యాంపు ఆఫీస్ ముందు ధర్నా చేశారు. దీంతో ధర్నాలో పాల్గొన్న ఆయా జిల్లాల్లోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 748 మందికి సోమవారం సాయంత్రం జిల్లా సంక్షేమాధికారి జరినా బేగం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేనిపక్షంలో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

News July 16, 2024

MBNR: ఏకరూప దుస్తులకు రూ. 1.31 కోట్ల నిధులు విడుదల

image

2024-25 విద్యా సంవత్సరంలో ఏకరూప దుస్తులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు కుట్టు కూలీ కోసం రూ. 1 31 కోట్ల నిధులు విడుదల అయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో జతకు రూ. 50 వంతున స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నారు.

News July 16, 2024

రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..?: నిరంజన్ రెడ్డి

image

రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని, మరీ రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. అందరి రుణాలను మాఫీచేస్తామని చెప్పి.. ఇప్పుడుమాత్రం కొందరికే రుణమాఫీ పరిమితం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.

News July 16, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు

image

✒జడ్చర్లలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు
✒వనపర్తి: వర్షంలో అంగన్వాడి ఉద్యోగుల భారీ ర్యాలీ
✒ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు
✒ప్రజావాణి.. సమస్యలపై అధికారుల దృష్టి
✒దోస్త్ మూడు దశల్లో చేరింది 9,709 మందే
✒MBNR: ఈనెల 18న అప్రెంటిస్ షిప్ మేళా
✒జడ్చర్ల:APSRTC బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు
✒భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లు
✒MBNR,NGKL,GDWLజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

News July 16, 2024

సీఎం రేవంత్‌కు గద్వాల ఎమ్మెల్యే వినతి

image

సీఎం రేవంత్ రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గద్వాలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి అయ్యే విధంగా నిధులు కేటాయించాలని అన్నారు. పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని కోరారు.

News July 15, 2024

MBNR: పోస్టాఫీసులో 122 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ డివిజన్‌లో 66, వనపర్తి డివిజన్‌లో 56 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వాలో 61.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా ఆత్మకూరులో 59.3 మి.మీ, మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 51.5 నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 42.5 మి.మీ, గద్వాల జిల్లా ద్యాగడ్డోడిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 15, 2024

RTC ఛైర్మన్‌గా డాక్టర్ వంశీకృష్ణ..?

image

అచ్చంపేట MLA వంశీ కృష్ణకు TG RTC ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. కేబినెట్‌లో అవకాశం లేకపోవడంతో ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. NGKL పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆయనకు అనుకూలంగా సీఎంకు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రకటించే అవకాశం ఉందని టాక్.