Mahbubnagar

News July 15, 2024

కృష్ణా నదికి మొదలు కాని వరదలు

image

వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్ చివరి లేదా జులై మొదటి వారంలో కృష్ణా నదికి వరద నీరు వచ్చేవి. గత రెండేళ్లుగా వర్ష ప్రభావం లేకపోవడంతో కేఎల్ఐ ద్వారా ప్రస్తుతం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నారు. సాగు అవసరాలకు నీళ్లు వదలడం లేదు. దీంతో వానాకాలం పంటలు సాగు చేస్తున్న రైతులు బోరుబావుల పైనే ఆధారపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం పొందిన వరద కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

News July 15, 2024

MBNR: దోస్త్ మూడు దశల్లో చేరింది 9,709 మందే

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం దోస్త్ ద్వారా అడ్మిషన్ల చేపట్టింది. ఇప్పటికి మూడు దశల్లో అడ్మిషన్లు చేపట్టగా.. ఉమ్మడి జిల్లాలోని 93 కళాశాలల్లో 31 వేల సీట్లు ఉండగా కేవలం 9,709 మంది విద్యార్థులు మాత్రమే చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ఆరు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు  చేసింది.

News July 15, 2024

NGKL: దారుణం.. చెల్లిపై అత్యాచారం !

image

చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన NGKL జిల్లాలో వెలుగుచూసింది. DSP శ్రీనివాస్ వివరాలు.. AP నంద్యాల జిల్లాకు చెందిన కేశవులు బిజినేపల్లి మం.లో కూలికి వచ్చాడు. వండి పెట్టేందుకు వచ్చిన చెల్లిపై కేశవులు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తల్లికి తెలిసిందని భయంతో కేశవులు పారిపోయాడు. వనపర్తి జిల్లాలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించగా విషయం తెలిసింది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు.

News July 15, 2024

ఆర్టీసీ బస్సు దగ్ధం.. క్షతగాత్రులు వెళ్లే!

image

RTC బస్సు ప్రమాదం బాధితులు మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో లక్ష్మీదేవి(అనంతపురం), సంజీవ(అనంతపురం), మోహన్‌(HYD), మైథిలి(HYD), కార్తిక్‌ (నంద్యాల), దస్తగిరి(నంద్యాల), హీరాలాల్‌ (HYD), అర్చన(HYD), సునిల్‌ (అనంతపురం), గాయత్రి(అనంతపురం)తో పాటు మరికొందరు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. 15 మందికి పైగా క్షతగాత్రులు ఉండగా అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

News July 15, 2024

ఆత్మకూరు: చెరువుకట్టపై పడుకున్న మొసళ్లు

image

ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై ఆదివారం రాత్రి మొసళ్ల సంచారించాయి. జూరాల ఎడమ కాలువ నుంచి నేపథ్యంలో విడుదలవుతున్న నీరు గ్రామ చెరువుకు చేరుతుంది. ఈ క్రమంలో ఇవి చెరువు కట్టపైకి వచ్చాయి. రాత్రి ఆటుగా వెళ్లిన చిన్నారులు విషయాన్ని కుటంబీకులు చెప్పారు. ఆత్మకూరు నుంచి మూలమల్ల మీదుగా నందిమల్ల, జూరాల ప్రాజెక్టుకు వెళ్లేవారు దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News July 15, 2024

జూరాల ప్రాజెక్టుకు వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం ఎగువ నుంచి 3,271 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈనెల 17 నాటికి జూరాలకు ఎగువ నుంచి భారీగా నీరు చేరనుందని అధికారులు అంటున్నారు.

News July 15, 2024

జడ్చర్లలో నేడు మంత్రుల పర్యటన

image

జడ్చర్ల నియోజకవర్గంలో నేడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రూ.56 కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు, రాజాపూర్ నుంచి రంగారెడ్డిగూడ వయా మల్లేపల్లి, ఇదిగానిపల్లి, కల్లేపల్లి మీదుగా రూ.30కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

News July 15, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటల నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News July 14, 2024

జడ్చర్ల: నల్లకుంట చెరువులో మృతదేహం లభ్యం

image

జడ్చర్లలోని నల్లకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. అటుగా వెళ్లిన స్థానికులు చెరువులోని నీటిపై తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 50ఏళ్లు, ఎత్తు 5.6 అడుగులు ఉండి నల్లగా ఉన్నాడని చెప్పారు. సమాచారం తెలిస్తే 8712659314ను సంప్రదించాలన్నారు.

News July 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ముగిసిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు.. విజేతగా మహబూబ్ నగర్
✒PUలో టైక్వాండో క్రీడలు
✒ప్రజల కోసం మొదటి కేసు నేనే ఎదుర్కొంటా: మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
✒పలుచోట్ల కురిసిన వర్షాలు
✒జగన్నాథ రథోత్సవం.. పాల్గొన్న ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒WNPT:వడ్డెగిరిలో 30ఏళ్ల తర్వాత మళ్లీ పీర్ల పండుగ
✒ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు
✒ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
✒కొనసాగుతున్న మొహర్రం వేడుకలు