India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. జిల్లాకు చెందిన యువకుడు చందు(18) పుట్టుకతోనే నాలుక అతుక్కుని ఉండడంతో మాట్లాడలేని పరిస్థితి. బీద కుటుంబం కావడంతో దీనిపై తల్లిదండ్రులు సూపరింటెండంట్‌ను కలిశారు. పరీక్షించిన వైద్యులు ప్రొ. డాక్టర్ గాయత్రీ, డాక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో అతుక్కున్న నాలుకకు విజయవంతంగా సర్జరీ చేసినట్లు చెప్పారు.
కల్వకుర్తిలోని మినీ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి MBNR, రెండో బహుమతి నిజామాబాద్, మూడో బహుమతి ఖమ్మం జిల్లా గెలుపొందగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
పాలమూరు యూనివర్సిటీలో ఆదివారం టైక్వాండో ఉమ్మడి జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 14 నియోజకవర్గాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. టైక్వాండో మాస్టర్ బాబూలాల్, PD శ్రీనివాసులు మాట్లాడుతూ.. సబ్ జూనియర్స్,సీనియర్స్ ఒక క్యాడర్ పద్ధతిలో మహిళలకు, పురుషులకు వేరువేరుగా పోటీలు నిర్వహించామన్నారు. విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశామన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆశీస్సులు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేసే ప్రజల మన్ననలు పొందాలని పాల్ సూచించినట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లురవి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది బదిలీల మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడినా.. ఈ రోజు వరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుంచి మార్గదర్శకాలు ఇంకా వెలువడ లేదు. దీంతో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా ద్యాగదొడ్డి 12.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి 5.3 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రం 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
పాలమూరు యూనివర్సిటీకి రానున్న రెండు సంవత్సరాల్లో రూ.100 నిధులు మంజూరు కానున్నాయి. ఇందులో కేంద్రం రూ.60 కోట్లు రాష్ట్రం రూ.40 కోట్లు భరిస్తాయి. ఈ నిధుల్లో పరిశోధనకు రూ.13 కోట్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధికి రూ.3 కోట్లు, మరమ్మతులకు రూ.5 కోట్లు వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను అమ్మాయిల ఈతకొలను, ఇండోర్ స్టేడియం, ఆసుపత్రి, పరిశోధన భవనాల కోసం ఖర్చు చేస్తారు.
కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాలు.. గోపాల్పేట మండలం బుద్ధారం లక్ష్మీ తండాకు చెందిన సంతోష్ (30) భార్య శారదతో కలిసి HYD నుంచి స్వగ్రామానికి సొంత కారులో వెళుతుండగా.. తిమ్మాజిపేట మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య శారదకు స్వల్ప గాయాలయ్యాయి.
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని దర్శనానికి మహబూబ్ నగర్ రీజియన్‌లోని MBNR, NGKL డిపోల నుంచి 10 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 19న రాత్రి రెండు డిపోల నుంచి బస్సులు అరుణాచలానికి బయలుదేరుతాయన్నారు. MBNR ప్రాంత ప్రయాణికులు 94411 62588, MGKL ప్రాంతం వాళ్లు 83092 14790 నంబర్లలో సంప్రదించాలని, పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ధర నిర్ణయించామన్నారు.
అయిజ మండలంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. ఉప్పలక్యాంపు గ్రామానికి చెందిన చెన్నకేశవరావు(24) కొంతకాలం చెన్నైలో ఉద్యోగం చేశాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం స్వగ్రామానికి వచ్చాడు. చికిత్స పొందుతూ, అయిజలోని ఉప్పల్‌దొడ్డిపేటలో చిన్నాన్న వద్ద ఉంటున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లి ఉప్పల రహదారిలో ఉన్న మంచినీటి సంప్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.